ముగిసిన శ్రీసాయి అంత్యక్రియలు
Published Tue, Jul 19 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
నిజాంపట్నం: మహ్మదీయపాలెం గ్రామస్తుల ఆగ్రహానికి బలైన వేముల శ్రీసాయి(18) అంత్యక్రియలను మంగళవారం అడవులదీవి గ్రామంలో నిర్వహించారు. శ్రీసాయి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గరువు గ్రామంలోని శ్రీ సాయి నివాసం నుంచి అడవులదీవి మెయిన్ సెంటర్ మీదగా మృతదేహానికి ఊరేగింపు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు భారీ ర్యాలీ నిర్వహించి మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేసి అడవులదీవి మెయిన్ సెంటర్‌లో బైఠాయించారు.దీంతో రేపల్లె రూరల్ సిఐ పెంచలరెడ్డి స్పందించి తప్పని సరిగా దోషులకు శిక్షపడేలా చూస్తామని హామీనిచ్చారు.
కొనగుతున్న పోలీస్ పహారా..
నిజాంపట్నం: జాస్మిన్, వేముల శ్రీసాయిల మృతితో రెండు రోజులుగా అడవులదీవి గ్రామంలో 144 సెక్షన్ అమలౌతుంది. మంగళవారం వేముల శ్రీసాయి అంత్యక్రియలు నిర్వహించడంతో గ్రామంలో అల్లర్లు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. గ్రామంలోని ప్రతి రహదారిలో పోలీసులు పహారా కాస్తూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బుధవారం కూడా 144 సెక్షన్ అమలౌతుందని పోలీస్ వర్గాలు తెలిపాయి.
అడవులదీవిలో బంద్..
శ్రీ సాయి అంత్యక్రియల్లో భాగంగా మంగళవారం గ్రామస్తులు బంద్‌కు పిలుపునిచ్చారు.దీంతో అడవులదీవి గ్రామంలోని దుఖాణాలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేశారు.
Advertisement