జనగామ జిల్లా కోసం ఉద్యమం ఉధృతి | Public meeting on New District At Janagama | Sakshi
Sakshi News home page

జనగామ జిల్లా కోసం ఉద్యమం ఉధృతి

Published Tue, Sep 20 2016 9:21 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

Public meeting on New District At Janagama

వరంగల్ : జనగామ జిల్లా కోసం ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. అందులోభాగంగా మంగళవారం జనగామలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు టీ జేఏసీ చైర్మన్ కోదండరాంతోపాటు పొన్నాల లక్ష్మయ్య, చుక్కా రామయ్య, చాడ వెంకట్రెడ్డి హాజరుకానున్నారు.

ఇప్పటికే జనగామ ప్రత్యేక జిల్లా చేయాలని ఇంతకుముందు తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో నేడు జరగనున్న ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. అలాగే కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లను ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ చేస్తు జిల్లా జేఏసీ మంగళవారం 48 గంటల పాటు బంద్కు పిలుపు ఇచ్చిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement