కరీంనగర్ : జనగామ జిల్లా కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన 12 మంది ఉద్యమకారులను పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జనగామ ప్రత్యేక జిల్లా కోసం ఆందోళన చేస్తున్న పలువురు రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాల నాయకుల ఇళ్లపై కూడా పోలీసులు దాడి చేశారు. ఆ తర్వాత వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని... పోలీస్ స్టేషన్కు తరలించారు.