గత నెల 23న జనగాంలో హత్యకు గురైన విజయ్ కేసును వరంగల్ జిల్లా పోలీసులు శనివారం ఛేదించారు. ఆ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, రెండు తుపాకులు, నాలుగు బుల్లెట్లుతోపాటు రూ. 6,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయ్ హత్యకు మురళీ ప్రధాన కారకుడని పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు ఉత్తరప్రదేశ్, ఒకరు కరీంనగర్, మిగతా ముగ్గురు జనగాంకు చెందిన వారని పోలీసులు తెలిపారు.