వరంగల్ జిల్లా జనగామ సోమవారం విద్యార్థుల నినాదాలతో మారుమోగిపోయింది.
జనగామ: వరంగల్ జిల్లా జనగామ సోమవారం విద్యార్థుల నినాదాలతో మారుమోగిపోయింది. కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల జాబితాలో జనగామను కూడా చేర్చాలంటూ జాతీయరహదారిపై ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం చేపట్టారు. రెండుగంటల పాటు జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, జనగామను జిల్లాగా చేయాలని నినాదాలు చేశారు.దీంతో పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులను విరమింపజేశారు.