
సాక్షి, హైదరాబాద్: మొఘలాయిల ఆగడాలపై పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెట్టాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి సందర్భంగా నందనం కృపాకర్ రాసిన ‘మరో ఛత్రపతి – మన తెలుగు దళపతి’పుస్తకాన్ని గురువారం ఆయన బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మొఘలాయిల ఆగడాలు, అకృత్యాలపై పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. సర్దార్ పాపన్న స్ఫూర్తితో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తిరగబడాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నిజాం, మొఘలాయిల తరహా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో మరో పోరాటానికి నాంది పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: విజయశాంతి బహిరంగంగా అసంతృప్తి.. తెర వెనుక ఎవరైనా ఉన్నారా?)
Comments
Please login to add a commentAdd a comment