వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న బండి సంజయ్, లక్ష్మణ్. చిత్రంలో వివేక్, చింతల రామచంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగి న కార్యక్రమంలో వాజ్‌పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంట రీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్య వర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి వాజపేయి సిద్ధాంతాలే కారణమన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతామని తెలిసి కూడా వాజపేయి వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. విలువలతో కూడిన రాజకీయాలకు వాజపేయి పెట్టింది పేరని పేర్కొన్నారు.
ప్రధానిగా వాజ్‌పేయి ఎన్నో సాహాసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తున్నారని బండి సంజయ్ కొనియాడారు. వాజపేయి జయంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, బండా కార్తీకరెడ్డి, కె.రాములు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2023 క్యాలెండర్‌ని బండి సంజయ్ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment