సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా శనివారం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీమోర్చా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి, ప్రజా సమస్యలు, ప్రభుత్వపరంగా స్పందన తదితర అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది.
కాగా, ఈ సమావేశాలకు చేసిన æఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర నాయకత్వానికి మోదీ అభినందనలు తెలిపినట్లు సమాచారం. కార్యవర్గ సమావేశాల మధ్యలో ఈ భేటీ చోటుచేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌పై మరింత దూకుడుగా వెళ్లాలని, ఇదే వాడి వేడిని కొనసాగించాలని సంజయ్, లక్ష్మణ్‌లకు అమిత్‌షా, నడ్డా సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యనేతలను పంపించి క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకోవడం వల్ల లోపాలున్న చోట సరిచేసుకోవడానికి వీలుపడుతుందని నడ్డా చెప్పిట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment