sardar sarvai papanna
-
హైదరాబాద్‌కు దగ్గరలో అద్భుతమైన కోట
భువనగిరి: హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి పట్టణంలోని భువనగిరి ఖిల్లా అనేక పోరాటాలకు, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ చెక్కు చెదరని నిర్మాణంగా ఉంది. సముద్ర మట్టానికి 610 మీటర్ల ఎత్తులో ఏకశిలా రాతిగుట్టపై నాటి రాజులు కోట నిర్మించారు. కోట కింది భాగంలో గుర్రాల కోసం కొట్టాలు, ధాన్యాన్ని నిల్వ చేయడానికి ధాన్యాగారాలు, సైనికుల కోసం సైనిక గారాలున్నాయి. రాజ భవనాల కింద శిలాగర్భంలో అనేక రహస్య మార్గాలున్నాయని స్థానికులు చెబుతుంటారు. చాళుక్యుల శిల్పరీతిని ప్రతిబింబించే రాజప్రసాదాలు, కాకతీయ శైలిలో అనేక శిలాకృతులను చెక్కారు.త్రిభువనమల్ల విక్రమాదిత్య పేరుతో.. కాకతీయుల కాలంలో భువనగిరి కోట (Bhuvanagiri Fort) ప్రముఖంగా ప్రసిద్ధి చెందింది. పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన ఆరవ త్రిభువనమల్ల విక్రమాదిత్య ఖిల్లాపై కోట నిర్మించారు. అతని పేరుమీదుగా దీనికి త్రిభవనగిరి (Tribhavanagiri) అనే పేరు వచ్చింది. ఈ పేరు క్రమంగా భువనగిరిగా మార్పు చెందింది. అలాగే త్రిభువనమల్లుకి స్థానికులైన గొల్ల దంపతులు ఈ కొండను చూపించారని అరణ్యంలో తీగలతో కప్పబడి ఉన్న ఈ కొండ కోట నిర్మాణానికి అనుకూలంగా ఉందని భావించి దర్గం నిర్మించారు. దీంతో స్థానికులైన బోనయ్య గిరమ్మ దంపతుల పేరుగానే ఈ పట్టణానికి భువనగిరిగా పేరు వచ్చిందని మరో కథనం కూడా ఉంది.ఈ కోట పరిసర ప్రాంతాల్లో మధ్యరాతియుగం, నవీన శిలాయుగం, మధ్య పాతరాతియుగం నాటికి చెందిన బాణాలు, రాతి గొడ్డళ్లు, కత్తులు, సమాధుల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. భువనగిరి కోట కొంతకాలం కుతబ్షాహీల పరిపాలనతో కూడా ఉంది. 1687లో మొఘలులు (Mughal Empire) గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట కొంత కాలం మొఘలుల పాలనలోకి వెళ్లింది. అనంతరం కల్లు గీత కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvayi Papanna) 1708లో ఓరుగల్లును గెలుచుకొని తర్వాత భువనగిరి కోటను జయించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఖిల్లాపై చెక్కుచెదరని నిర్మాణాలు భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అని పిలుస్తారు. నిజాం రాజు తన సొంత ఖర్చుతో ఈ ద్వారాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇది గోల్కొండ కోటలోని బాలాహిస్సార్ మొదటి ద్వారం ఫతే దర్వాజాను పోలి ఉంటుంది. ఎత్తైన గోడలు, విశాలమైన గదులు, ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలిలో కనిపిస్తాయి. అండాకారపు ఏకశిలాపర్వతం గల కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలుగా, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులాగా కనిపిస్తుంది.ఏనుగుల మోట వాగులు, బైరవకొలను, సప్త కన్యలు అనే పేరుతో నీటి కొలనులు ఉన్నాయి. దిగుడు మెట్ల బావులు, వంట గదులు, అశ్వ శాలలు, ఎనిమిది దిక్కుల్లో ఫిరంగులున్నాయి. ఖిల్లాపైన మూడు అత్యవసర ద్వారాలున్నాయి. ఇందులో రెండు మూసుకుపోగా ఒకటి మాత్రం నామమాత్రంగా ఉంది. శిలాశాసనాలు, దేవాలయాలకు చెందిన శిథిలాలు కూడా ఉన్నాయి. కొండ మధ్య భాగంలో మండపంతో పాటు ఖిల్లా చుట్టూ రక్షణ గోడలలో మూడు అంచెలలో ఎలాంటి మట్టి లేకుండా పూర్తిగా రాతితోనే నిర్మించారు. సందర్శకుల సందడి.. భువనగిరి ఖిల్లాను సందర్శించేందుకు నిత్యం ఎంతో మంది వస్తుంటారు. ఇందులో ప్రధానంగా జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఖిల్లాలో సందర్శకులతో సందడి కనిపిస్తుంది. భువనగిరి ఖిల్లాను అ మెరికా, రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, బ్రిటన్, దేశాలకు చెందిన వారితో పాటు దేశంలోనే అన్ని రాష్టాలకు చెందిన వారు కూడా సందర్శిస్తుంటారు. చారిత్రక చరిత్ర కలిగిన ఖిల్లాపై ఎన్నో బాలీవుడ్ సినిమాలకు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరించారు. ఖిల్లా అభివృద్ధికి చర్యలు భువనగిరి ఖిల్లా అభివృద్ధికి 2024లో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ కింద రూ.118 కోట్లు కేటాయించింది. ఇటీవల మళ్లీ అధికారంలోకి వచ్చిన కేంద్రం ప్రభుత్వం తిరిగి ఖిల్లా అభివృద్ధికి మొదటి విడత కింద రూ.58 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఖిల్లాపై రోప్ వేతో పాటు కింది భాగంగా బీటీ రోడ్డు, ఖిల్లాపై విశ్రాంతి ప్రదేశాలు, పార్కులు, ఆట సామగ్రి, కింది భాగంలో పార్కింగ్ కోసం ప్రదేశాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ కాంతులు వెదజల్లేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం వంటి వాటిని ప్రణాళిక కింద తీసుకున్నారు. ఈ అభివృద్ధి పనులను చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించి చేపట్టేందుకు టెండర్లు దశలో ఉన్నాయి.చదవండి: అద్భుతం కోరుట్ల మెట్లబావి.. రాతి స్తంభాల కింద సొరంగం -
సర్వాయి పాపన్న తెలంగాణకు గర్వకారణం
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని రాష్ట్రమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రవీంద్ర భారతిలో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...తెలంగాణ వాడి వేడిని నాడే చాటిచెప్పిన శౌర్యుడు పాపన్నని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై నీరా కేంద్రం, గౌడ ఆత్మగౌరవ భవనాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బహుజన ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నగరంలో విలువైన భూములను ఇవ్వడంతోపాటు రూ.95 కోట్లను విడుదల చేశారని వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే వాటి మీద కనీసం అవగాహన లేని వ్యక్తులే విమర్శలు చేస్తున్నారని దుయ్య బట్టారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశం, ఎక్సైజ్ శాఖ కమి షనర్ సర్పరాజ్ అహ్మద్, ఎస్.హరిశంకర్ గౌడ్, పల్లె లక్ష్మణ్ రావుగౌడ్, వివిధ సంఘాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు. -
జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: మొఘలాయిల ఆగడాలపై పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెట్టాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి సందర్భంగా నందనం కృపాకర్ రాసిన ‘మరో ఛత్రపతి – మన తెలుగు దళపతి’పుస్తకాన్ని గురువారం ఆయన బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొఘలాయిల ఆగడాలు, అకృత్యాలపై పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. సర్దార్ పాపన్న స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నిజాం, మొఘలాయిల తరహా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో మరో పోరాటానికి నాంది పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: విజయశాంతి బహిరంగంగా అసంతృప్తి.. తెర వెనుక ఎవరైనా ఉన్నారా?) -
తెలంగాణ వీరత్వానికి ప్రతీక పాపన్నగౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వీరత్వానికి, పరా క్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సబ్బండవర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాథను ఆగస్ట్ 18న ఆయన జయంతి సందర్భంగా స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని కేసీఆర్ ప్రశంసించారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వ హిస్తూ.. బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటోందని తెలిపారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. -
కుప్పకూలిన సర్దార్ సర్వాయి పాపన్న కోట
సాక్షి, జనగామ: శక్తివంతమైన మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించిన సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన రాతి కోట కూలిపోయింది. గోల్కొండ సామ్రాజ్యంపై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన పాపన్న.. తన విజయయాత్ర సాగించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో నిర్మించిన కోట గురువారం నేల మట్టమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో కోటలోని ఒకవైపు భాగం కూలిపోయింది. 20 అడుగుల ఎత్తు ఉన్న కోట గోడ మొత్తం కింద పడగా మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భారీ శబ్ధం రాగా, గ్రామస్తులు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కోట పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఇటీవలే రెవెన్యూ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు. చదవండి: భారీ వర్షం.. క్షణాల్లో కుప్పకూలిన భవనం పర్యవేక్షణ లేక లోపించిన నాణ్యత ఖిలాషాపూర్ కోటను 17 మే 2017న చారిత్రక ప్రాంతంగా గుర్తించారు. టూరిజం స్పాట్‌గా ఎంపిక చేయడంతో పాటు కోట అభివృద్ధి కోసం రూ.4.50 కోట్ల నిధులను విడుదల చేశారు. నాలుగేళ్ల క్రితమే నిధులు విడుదలైనా పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొంతకాలానికి పనులు మొదలైనా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మమ అనిపించారు. పనులు నేటికి అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంతలోనే కోట కూలిపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. చదవండి: ఎడతెగని వాన.. వందేళ్ల రికార్డు బ్రేక్ పాపన్న చరిత్ర ఇదీ దక్కన్ పీఠ భూమిలోని గోల్కొండ రాజ్యం సిరి సంపదలతో వర్ధిల్లేది. సామ్రాజ్య విస్తరణలో భాగంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ ప్రాంతంపై కన్నేసి దండయాత్రకు పూనుకున్నాడు. ఈ క్రమంలోనే క్రీ.శ.1687 లో గోల్కొండను ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. మొఘల్ పాలన క్రీ.శ.1687 నుంచి క్రీ.శ.1724 వరకు కొనసాగింది. మొఘల్ పాలకులు నియమించుకున్న సుబేదార్ల ఆగడాలతో గోల్కొండ రాజ్యంలో అరాచకం నెలకొన్నది. ప్రజలపై దోపిడీ, దాడు లు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయి సమాజంలో అశాంతి నెలకొనడంతో ప్రజలు తీవ్ర అణచివేతకు గురయ్యారు. గౌడ కులం లో జన్మించిన పాపన్న.. పాలకులు సాగిస్తున్న విధానాలను వ్యతిరేకంగా పోరాడారు. బలహీన వర్గాలను ఏకం చేస్తే గోల్కొండను స్వాధీనం చేసుకోవచ్చనే ఆశయంతో సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చెదిరిపోతున్న ఆనవాళ్లు సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన రాతి కోట ఆనవాళ్లు కాలక్రమంలో చెదిరిపోతున్నాయి. మాజీ డీజీపీ పేర్వారం రాములు చొరవతో లండన్ మ్యూజియంలో ఉన్న పాపన్న ఫొటో ఆధారంగా ఖిలాషాపూర్ కోటను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా గ్రామంలో పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పేర్వారం రాములు కోట అభివృద్ధి కోసం కృషి చేశారు. కానీ ప్రస్తుతం పట్టించుకునే నాథుడు లేక కోట రూపం మారిపోతోంది. ఖిలాషాపూర్‌లోనే తొలి కోట ఈ క్రమంలోనే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో శత్రు దుర్బేధ్యంగా పూర్తిగా రాతితో ఈ కోటను నిర్మించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ 20 అడుగుల ఎత్తులో రాతికోటను నిర్మించారు. నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. కోట లోపల సొరంగ మార్గాలు సైతం ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు. మొఘల్ పాలకులపై తిరుగుబాటును ప్రకటించిన పాపన్న.. తొలికోటను ఖిలాషాపూర్‌లోనే నిర్మించినట్లుగా చరిత్రకారుల అభిప్రాయం. ఔరంగజేబు మరణం తర్వాత బలహీనపడిన మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి పలు కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఖిలాషాపూర్ కోట కేంద్రంగా వరంగల్, భువనగిరి, చివరికి గోల్కొండను సైతం వశపర్చుకున్నారు. -
సర్దార్ సర్వాయి పాపన్న త్యాగమూర్తి
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ హైదరాబాద్: బహుజనవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహరాజ్ అసమాన త్యాగమూర్తి అని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఈ నెల 18న హైదరాబాద్ కిస్మత్పూర్లో వైభవోపేతంగా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ గౌడ సంఘం ప్రధానకార్యదర్శి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రారంభమైన పాపన్నగౌడ్ మహారాజ్ 366వ జయంతి వారోత్సవాలకు స్వామిగౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమగీతాల సీడీని, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వీరోచిత సంక్షిప్తచరిత్ర(1650-1709) పుస్తకం, గడప గడపకు జైగౌడ్ ఉద్యమ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్కన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన పాలకుల్లో సర్వాయి పాపన్నది రెండోస్థానమని కొనియాడారు. పాపన్న కేవలం గౌడ కులస్తుల హక్కుల కోసమే కాకుండా బహుజనులందరి అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గురించి మాట్లాడుకోవడమేకాకుండా, ఆయన నుంచి స్ఫూర్తిని కూడా పొందాలని అన్నారు. పాపన్న చరిత్ర గౌడ కులస్తులకే తెలియనప్పుడు ఆయన విగ్రహాన్ని గోల్కొండ కోటపై ఏర్పాటు చేయాలని, ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని ఎలా అడుగుతామని ప్రశ్నించారు. కులం పేరును రుబాబుగా తన పేరు చివరన పెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికవృత్తిని కాపాడుకోవాలని, దీనిలో భాగంగా హరితహారంలో పెద్దఎత్తున ఈత, తాటి చెట్లను గ్రామగ్రామాన నాటాలని సూచించారు. తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు రాజకీయంగా ముందుండాలని పిలుపునిచ్చారు. నిరుపేద గౌడ విద్యార్థుల కోసం హాస్టళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. సివిల్స్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ సంస్థను నెలకొల్పనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మనరూప రియల్ ఎస్టేట్స్ అధినేత మద్దెల రమేష్‌బాబుగౌడ్, తెలంగాణ గౌడ సంఘం గౌరవాధ్యక్షుడు బండి నర్సాగౌడ్, అధ్యక్షుడు ఈడ శేషగిరిరావు, ఉపాధ్యక్షులు కాశీనాథ్‌గౌడ్, గౌడ ప్రముఖులు రఘునందన్ గౌడ్, ఉపేందర్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఖిలాషాపూర్‌లో పాపన్న విగ్రహం
ఆవిష్కరించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్l హాజరైన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం, ఎమ్మెల్యేలు ఖిలాషాపూర్ (రఘునాథపల్లి): మండలంలోని ఖిలాషాపూర్ బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన సామాజికోద్యమ నేత, బహుజనుల స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌తో పాటు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లకు గౌడ కులస్తులు, గ్రామస్తులు తొలుత ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, తాటికొండ రాజయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములుతో కలిసి స్వామిగౌడ్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే, పాపన్న యాదిలో తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బస్సుయాత్రను వారు జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పాపన్న నిర్మించిన కోట వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. కోటలోని బురుజులు, సొరంగ మార్గాలను పరిశీలించగా.. శత్రుదుర్బేద్యంగా నిర్మించిన కోట, సొరంగ మార్గాల వివరాలను పేర్వారం రాములు వారికి వివరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు బురుజు పైకి ఎక్కి పాపన్న జోహార్ అంటూ నినదించారు. కార్యక్రమంలో విగ్రహ దాత చింతల మల్లేశం, మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగంగౌడ్, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ సభ్యురాలు బానోతు శారద, వైస్ ఎంపీపీ మల్కాపురం లక్ష్మయ్య, సర్పంచ్ దొంగ అంజిరెడ్డి, ఎంపీటీసీ భూశెట్టి కుమార్, గీత కార్మిక సంఘం నాయకులు బూడిద గోపి, వంగ శ్రీనివాస్, మీసాల కుమార్, బీమగోని చంద్రయ్య, గడ్డం అంజయ్య, బాల్నె రాజయ్య, నాసగోని పెద్దపురం, పరశురాములు, దూడల యాదగిరి, వెంకన్న, రాములు, సత్యం, చలపతి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
గుట్టలను పోగొట్టుకుంటే పుట్టుక ఉండదు
సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి ఈటల సర్ధార్ సర్వాయి పాపన్న గొప్ప ఉద్యమకారుడు సైదాపూర్‌రూరల్ : గుట్టలను పోగొట్టుకుంటే భవిష్యత్తులో పుట్టుకనేదే ఉండదని, గుట్టలున్న ప్రతి ప్రాంతాల్లో గుడికట్టి గుట్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని కొమ్ముగుట్టపై సర్దార్ సర్వాయి పాపన్న 365వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అథితిగా హాజరైన ఈటల రాజేందర్ కొమ్ముగుట్టపై పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆనాటి దోపిడి, రాచరిక దుర్మార్గాలకు అరికట్టేందుకు సొంత సైన్యాన్ని ఏర్పర్చుకుని పోరాడిన గొప్ప ఉద్యమకారుడని పాపన్నను కొనియాడారు. కళ్లముందే అన్యాయం జరుగుతుంటే 17వ శతాబ్దంలో తెలంగాణలోని గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన మహావీరుడు పాపన్న అన్నారు. కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో అనేక కోటలను జయించిన వీరుడని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం గౌడ్, నారదాసు లక్ష్మణ్‌రావు, గౌడసంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బురుగు రామస్వామిగౌడ్, గౌరవ సలహాదారు పెద్దంపేట శంకర్, రాష్ట్ర అధ్యక్షుడు వీరగోని పెంటయ్య, రాష్ట్ర సెక్రటరీ జనరల్ కలర్ సత్తన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల సోమయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుండ్రాతి శారద, ఎంపీపీ ముత్యాల ప్రియారెడ్డి, జెడ్పీటీసీ బిల్ల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ బత్తుల సరోజన, ఎంపీటీసీ జగురాణీ బాయి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చందా శ్రీనివాస్, బీఎంసీ నాయకులు జంపయ్య, శ్రీనివాస్, ప్రవీణ్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.