తెలంగాణ వీరత్వానికి ప్రతీక పాపన్నగౌడ్‌ | Telangana CM KCR Pays Tribute To Sardar Sarvai Papanna | Sakshi
Sakshi News home page

తెలంగాణ వీరత్వానికి ప్రతీక పాపన్నగౌడ్‌

Aug 19 2022 2:05 AM | Updated on Aug 19 2022 1:27 PM

Telangana CM KCR Pays Tribute To Sardar Sarvai Papanna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వీరత్వానికి, పరా క్రమానికి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సబ్బండవర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాథను ఆగస్ట్‌ 18న ఆయన జయంతి సందర్భంగా స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని కేసీఆర్‌ ప్రశంసించారు.

సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వ హిస్తూ.. బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటోందని తెలిపారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్‌ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement