ఖిలాషాపూర్‌లో పాపన్న విగ్రహం
-
ఆవిష్కరించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్l
-
హాజరైన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం, ఎమ్మెల్యేలు
ఖిలాషాపూర్ (రఘునాథపల్లి): మండలంలోని ఖిలాషాపూర్ బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన సామాజికోద్యమ నేత, బహుజనుల స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌తో పాటు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లకు గౌడ కులస్తులు, గ్రామస్తులు తొలుత ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, తాటికొండ రాజయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములుతో కలిసి స్వామిగౌడ్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అలాగే, పాపన్న యాదిలో తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బస్సుయాత్రను వారు జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పాపన్న నిర్మించిన కోట వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. కోటలోని బురుజులు, సొరంగ మార్గాలను పరిశీలించగా.. శత్రుదుర్బేద్యంగా నిర్మించిన కోట, సొరంగ మార్గాల వివరాలను పేర్వారం రాములు వారికి వివరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు బురుజు పైకి ఎక్కి పాపన్న జోహార్ అంటూ నినదించారు. కార్యక్రమంలో విగ్రహ దాత చింతల మల్లేశం, మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగంగౌడ్, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ సభ్యురాలు బానోతు శారద, వైస్ ఎంపీపీ మల్కాపురం లక్ష్మయ్య, సర్పంచ్ దొంగ అంజిరెడ్డి, ఎంపీటీసీ భూశెట్టి కుమార్, గీత కార్మిక సంఘం నాయకులు బూడిద గోపి, వంగ శ్రీనివాస్, మీసాల కుమార్, బీమగోని చంద్రయ్య, గడ్డం అంజయ్య, బాల్నె రాజయ్య, నాసగోని పెద్దపురం, పరశురాములు, దూడల యాదగిరి, వెంకన్న, రాములు, సత్యం, చలపతి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.