గుట్టలను పోగొట్టుకుంటే పుట్టుక ఉండదు
సర్వాయి పాపన్న జయంతి
వేడుకల్లో మంత్రి ఈటల
సర్ధార్ సర్వాయి పాపన్న
గొప్ప ఉద్యమకారుడు
సైదాపూర్‌రూరల్ : గుట్టలను పోగొట్టుకుంటే భవిష్యత్తులో పుట్టుకనేదే ఉండదని, గుట్టలున్న ప్రతి ప్రాంతాల్లో గుడికట్టి గుట్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని కొమ్ముగుట్టపై సర్దార్ సర్వాయి పాపన్న 365వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అథితిగా హాజరైన ఈటల రాజేందర్ కొమ్ముగుట్టపై పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆనాటి దోపిడి, రాచరిక దుర్మార్గాలకు అరికట్టేందుకు సొంత సైన్యాన్ని ఏర్పర్చుకుని పోరాడిన గొప్ప ఉద్యమకారుడని పాపన్నను కొనియాడారు.
కళ్లముందే అన్యాయం జరుగుతుంటే 17వ శతాబ్దంలో తెలంగాణలోని గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన మహావీరుడు పాపన్న అన్నారు. కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో అనేక కోటలను జయించిన వీరుడని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం గౌడ్, నారదాసు లక్ష్మణ్‌రావు, గౌడసంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బురుగు రామస్వామిగౌడ్, గౌరవ సలహాదారు పెద్దంపేట శంకర్, రాష్ట్ర అధ్యక్షుడు వీరగోని పెంటయ్య, రాష్ట్ర సెక్రటరీ జనరల్ కలర్ సత్తన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల సోమయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుండ్రాతి శారద, ఎంపీపీ ముత్యాల ప్రియారెడ్డి, జెడ్పీటీసీ బిల్ల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ బత్తుల సరోజన, ఎంపీటీసీ జగురాణీ బాయి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు చందా శ్రీనివాస్, బీఎంసీ నాయకులు జంపయ్య, శ్రీనివాస్, ప్రవీణ్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.