జనగామ బంద్ సంపూర్ణం
-
144 సెక్షన్ అమలుతో నిశ్శబ్ద విప్లవం
-
జేఏసీ నాయకులపై పోలీసుల నిఘా
జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో జేఏసీ పిలుపునిచ్చిన 48 గంటల బంద్ మొదటి రోజు విజయవంతమైంది. జేఏసీ చైర్మెన్ ఆరుట్ల దశమంతరెడ్డి నాయకత్వంలో శనివారం మొదటి రోజు బంద్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జిల్లా కావాలనే బలమైన సంకేతాన్ని మరోసారి చూపించారు. పట్టణంతో పాటు డివిజన్‌లోని పలు మండల కేంద్రాల్లో బంద్ విజయవంతంగా సాగుతోంది.
పెట్రోలు బంక్‌లు, సినిమాహాళ్లు, జ్వువెల్లర్స్, కిరాణ, వస్త్ర దుకాణాలు మూసివేయడంతో జనగామ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ని మారిపోయాయి. 144 సెక్షన్ అమలులో ఉండడంతో నిశ్శబ్ధ విప్లవం సృషించారు. రహదారులపై గ్రూపులుగా తిరగరాదంటూ పోలీసులు ప్రచారం చేస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రుల సబ్‌కమిటీ సమావేశంలో ప్రజాప్రతిని ధులు, అధికారులతో చర్చ సాగనున్న నేపథ్యంలో బంద్ ప్రభావం ఏ మేరకు లాభం చేకూరుతుందో చూడాలి. గతం లో ఎన్నడూ లేని విధంగా బంద్‌కు మంచి స్పదన రావడంతో జేఏసీ నాయకులు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.