
పొన్నాలకు సీఎం చాన్స్: జయప్రద
జనగామ, న్యూస్‌లైన్: తనపై ఉన్న ప్రేమను.. అభిమానాన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఓటుగా మార్చి గెలిపించాలని సినీనటి, ఎంపీ జయప్రద అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో సోమవారం పొన్నాల చేపట్టిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. సోనియా, రాహుల్ గాంధీ కరుణతో పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మతాలు.. జాతుల పేరుతో వచ్చే నాయకులను నమ్మొద్దని కోరారు. నటిగా ఉన్న సమయంలో ప్రజలు చూపించిన ఆదరణ మరిచిపోలేనిదని, ఇప్పుడు రాజకీయాల్లోనూ తనకు అండగా ఉంటున్నారని అన్నారు.