జిల్లా ఏర్పాటుతోనే జనగామ అభివృద్ధి | With the formation of the district development janagama | Sakshi
Sakshi News home page

జిల్లా ఏర్పాటుతోనే జనగామ అభివృద్ధి

Published Fri, Jun 3 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

జిల్లా కేంద్రం ఏర్పాటుతోనే జనగామ అభివృద్ధి చెందుతుందని జనగామ జిల్లా ముస్లిం పోరాట వేదిక ప్రతినిధి ఎండీ. అన్వర్ అన్నారు.

ముస్లిం పోరాట వేదిక ప్రతినిధి ఎండీ.అన్వర్ పట్టణంలో ముస్లింల ర్యాలీ, మానవహారం
 
 
జనగామ : జిల్లా కేంద్రం ఏర్పాటుతోనే జనగామ అభివృద్ధి చెందుతుందని జనగామ జిల్లా ముస్లిం పోరాట వేదిక ప్రతినిధి ఎండీ. అన్వర్ అన్నారు. జనగామ జిల్లా ఏర్పాటును కోరుతూ జనగామ జిల్లా ముస్లిం పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఆ సంఘం ప్రతినిధులు, ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టి, ప్రధాన చౌరస్తాలో మానహారం నిర్వహించి, స్థానిక ఆర్డీఓ కా ర్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం అన్వర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించనున్న జిల్లాల్లో జనగామకు అనుకున్న అనుకూలతలు మరె ప్రాంతానికి లేవన్నారు. జనగామ, పాల కుర్తి, ఆలేరు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలతో జనగామ జిల్లా పూర్తిగా 50 కిమీ పరిధిలో ఉన్న మండలాలు, గ్రామాలను పునర్ వ్యవస్థీకరించి జనగామ జిల్లా ఏర్పా టు చేసేందుకు శాస్త్రీయంగా బద్ధంగా ఉందన్నారు. వరంగల్‌లో ప్రకటించిన 11 మండలాల్లో 9 మండలాలు జనగామలోనే ఉన్నాయని, జిల్లాగా ప్రకటిస్తే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధుల కేటాయింపుతో శాశ్వతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే జనగామ ప్రాంత ప్రజలు జిల్లాగా ప్రకటించాలని ఎనిమిది నెలలుగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బంద్‌లు, నిరవధిక దీక్షలు చేస్తూ ఆకాంక్షను చాటుతున్నారన్నారు.


కానీ, కొంతమంది కుట్రదారులతో జనగామ జిల్లా ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఏర్పాటును ఆకాంక్షను ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. నా యకులు మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాస్మి, అన్వర్ షరీఫ్, మజహర్ షరీఫ్, గౌస్, మోహియోద్దీన్, ముజీబుర్ రహమాన్, కౌన్సిలర్లు ఎండీ.అన్వర్, మహ్మద్ ఎజాజ్, జమాల్ షరీఫ్, జమాతె షబాబ్, అధ్యక్ష, కార్యదర్శులు అన్వర్, ఎక్భాల్, కలీమోద్దీన్, ముజ్‌తహదిద్ధోన్, ఎండీ.సలీం, ఎజాజ్, ఇమ్రాన్, సమద్, షాజిద్, తహసీన్, అక్రం, అజీమ్, అజహరుద్దీన్, దస్తగిరి, యాకుబ్, యాసర్, ఫయాజ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement