ఆందోళనకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు( ఫైల్)
జనగామ: జనగామను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. తాజాగా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళనకు దిగిన జేఏసీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం కళ్లకు గంతలు కట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న స్పీకర్ మధుసూదనా చారి కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నేటి నుంచి 48 గంటల జనగామ నిరవధిక బంద్ నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.