జాతీయ స్థాయిలో కీలక స్థానంలో ఉన్న ముగ్గురు మహిళలు తల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
జనగామ, న్యూస్‌లైన్ : జాతీయ స్థాయిలో కీలక స్థానంలో ఉన్న ముగ్గురు మహిళలు తల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం స్థాని క ఆర్‌అండ్‌బీ అతిథ గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్లమెంటు ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, స్పీకర్ మీరాకుమారి ఈ ముగ్గురు మహిళలు తల్చుకుంటే తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటుకు వచ్చి త్వరగా ఆమోదం పొందుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానా లు చేసిన అమరుల కుటుంబాల మహిళలను సమీకరించి నవంబర్ 10న హైదరాబాద్‌లో ‘అమరుల తల్లుల సభ’ నిర్వహిస్తున్నామని, అయినా స్పందించకుంటే 27న విద్యార్థులతో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడతామని అన్నా రు. రాబోయే తెలంగాణలో అమరుల కుటుం బాలకు ఉద్యోగం, 5 ఎకరాల భూమి, నెలకు రూ5000 పింఛన్ అందించే ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయాలని, అలా కాని పక్షంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
1969లో తెలంగాణ వాదులపై కాల్పు లు జరిగిన రోజును అమరవీరుల దినోత్సవం గా ప్రభుత్వమే నిర్వహించాలని, 900 ఎకరాల కాసుబ్రహ్మానందరెడ్డి పార్కుకు తెలంగాణ అమరుల స్మారక పార్కుగా నామకరణం చేసి, అందులో వారి విగ్రహాలను ఏర్పాటు చేయాల ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు తిప్పారపు లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజు, సలహాదారు డాక్టర్ ఆదాం, మండల నాయకు లు భాస్కర్, పిడుగు ఆశీర్వాదం, యాసారపు అంజయ్య, చింతల యాదగిరి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.