- లేనిపక్షంలో ఆయన పర్యటనలో నిరసన తప్పదు
- 9న చలో హైదరాబాద్
- జనగామ జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి
జిల్లాపై కడియం స్పష్టత ఇవ్వాలి
Published Tue, Aug 2 2016 12:09 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM
జనగామ : జనగామ జిల్లాపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి హరితహారం కార్యక్రమానికి హాజరుకావాలని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. పట్టణంలో సోమవారం జరిగిన జేఏసీ స మావేశంలో 15 రోజుల కార్యచరణ ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశమంతరెడ్డి మాట్లాడారు. ఈనెల 4న జనగామలో జరిగే హరితహారంలో పాల్గొనేం దుకు రానున్న కడియం శ్రీహరి జిల్లాపై స్పష ్టత ఇవ్వకుండా వస్తే నిరసనలు తప్పవని హె చ్చరించారు. తెలంగాణ సాయుధ పోరా టం నుంచి స్వరాష్ట్రంకోసం సాగిన ఉద్యమంలో సైతం లేని విధంగా నెల రోజులుగా 144 సెక్ష న్ అమలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. పట్టణంలో అప్రకటిత క ర్ఫూ్య వాతావరణం నెలకొందని, దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వహించాలన్నా రు. 144 సెక్షన్ తో శాంతి యుత ఉద్యమాలపై ఉక్కుపా దం మోపుతున్నారని మండిపడ్డారు. 144 సెక్షన్‌పై ఆర్డీవోను కలిసిన అనంతరం హైకోర్టులో రిట్ వేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement