
సాక్షి, హైదరాబాద్: జనగామలోని బతుకమ్మకుంట చెరువులో అక్రమ నిర్మాణాల అంశంపై సోమవారం శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఆక్రమణలపై కలెక్టర్ నివేదిక ఇచ్చి నా చర్యలు ఎందుకు తీసుకోలేదని విపక్ష కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే చెరువును ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే, కలెక్టర్ మధ్య జరిగిన సంభాష ణ టేపులు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. ఒక ఐఏఎస్ అధికారిపై దౌర్జన్యం కూడా చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెండెకరాలకు మించిన చెరువులను పూడ్చరాదని, కానీ బతుకమ్మకుంట చెరువులో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగిం దని పొంగులేటి విమర్శించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ సమాధానమిస్తూ.. బతుకమ్మకుంట చెరువు శిఖం భూమిలో ఒక ఆక్రమణ, పూర్తిస్థాయి చెరువులోని పట్టా భూమిలో 6 నిర్మాణాలు ఉ న్నట్లు గుర్తించామన్నారు.
ఆక్రమించిన చెరువు విస్తీర్ణం 3,855 చదరపు గజాలని, పట్టా భూమిలో నిర్మాణాల విస్తీర్ణం 976 గజాలని వివరించారు. ఆక్రమణదారుల నుంచి చెరువును రక్షించాలని జిల్లా సాగునీటి అధికారిని కలెక్టర్ ఆదేశించారన్నారు. సమాధానంపై సం తృప్తి చెందని షబ్బీర్, పొంగులేటి న్యాయ వి చారణకు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి శ్రీ నివాస్ యాదవ్ జోక్యం చేసుకుంటూ ఈ అం శంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చే స్తోంద ని మండిపడ్డారు. అక్కడ గుడి నిర్మాణం జరిగినట్లు కనిపిస్తోంది తప్ప ఎమ్మెల్యే ఆక్రమించిన ట్లు ఏమీ లేదన్నారు. ప్రభుత్వ సమాధానానికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment