
జనగామ : గ్రామ తొలి పౌరుడిగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన గ్రామ సర్పంచ్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పతుండటంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామ సర్పంచ్ వేముల వెంకటేశ్‌ను గ్రామస్థులు చితకబాదారు. కారులో వెళ్తున్న వెంకటేశ్‌ను అడ్డుగించి దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు మహిళలు కూడా ఉన్నారు. గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే సర్పంచ్‌పై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దాడికి సంబంధిన ఘటనను స్థానికులు వీడియోలో చిత్రీకరించడంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment