వరంగల్ జిల్లా జనగామలో ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్: వరంగల్ జిల్లా జనగామలో ఉద్రిక్తత నెలకొంది. జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని గత కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం కొంతమంది ఆందోళనకారులు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అదుపు తప్పిన ఆందోళ కారులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటలో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై నిరసనకారులు భైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిపోయాయి. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.