జనగామ సీఐ శ్రీనివాస్ సతీమణి ముసికె ఆశాజ్యోతి నిహారిక(30) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది.
ఫిట్స్‌తో మృతిచెందినట్టు వైద్యుల వెల్లడి
విచారణ జరిపించాలని కోరిన మృతురాలు బంధువులు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
జనగామ : జనగామ సీఐ శ్రీనివాస్ సతీమణి ముసికె ఆశాజ్యోతి నిహారిక(30) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన నిహారికను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రకి తరలించగా.. చికిత్స చేస్తుండగానే మృతిచెందింది. శ్రీనివాస్ జనగామ సీఐగా పది రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. రూరల్ పోలీస్టేషన్ క్వార్టర్‌లో భార్యతో కలిపి నివాసం ఉంటున్నారు. కొమురవెల్లి జాతర బందోబస్తుకు ఆదివారం రా త్రి సీఐ అక్కడకు వెళ్లారు. అదే రోజు రాత్రి సీఐ అక్క ధర్మావతి, మేనల్లుడు పల్ల శివకృష్ణ వచ్చా రు. రాత్రి వరకు వారితో ఉన్న సీఐ శ్రీనివాస్ ఆ తర్వాత కొమురవెల్లి వెళ్లారు. అర్ధరాత్రి 12.30 గంటలకు నిహారిక శబ్ధం చేసుకుంటూ మంచంపై నుంచి కింద పడిపోవడంతో ఆడబిడ్డ ధర్మావతి మేల్కొని శ్రీనివాస్‌కు ఫోన్ చేసింది. వెంటనే ఆమె ను పోలీస్ రక్షక్ వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించగా, ఆర్‌ఎంవో సుగుణాకర్‌రాజు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. నిహారిక చికిత్స పొందుతూ 1.30 గంటలకు మృతి చెందింది. అప్పటికే భర్త, సీఐ శ్రీని వాస్ ఆస్పత్రికి చేరుకున్నారు. నిహా రిక ఫిట్స్ కారణంగానే మృతి చెందినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
మృతురాలి సోదరుడు రం జిత్‌కుమార్ తన సోదరి మృ తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసినట్లు జనగామ ఎస్‌ఐ శ్రీని వాస్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన సీఐ శ్రీనివాస్‌కు మహబూబాబాద్‌కు చెం దిన ఆశాజ్యోతి నిహారికతో 2009లో వివాహమైం ది. వీరికి ఆరేళ్ల కుమారుడు సన్ని ఉన్నాడు. నిహారి క మృతి వార్త తెలుసుకున్న బంధువులు జనగామ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. నిహారిక మృతదేహానికి తహసీల్దార్ చెన్నయ్య శవపంచనామా చేయగా, వీడియో పర్యవేక్షణలో వైద్య నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు. అంతకు ముందు మృతదేహాన్ని సిటీ స్కానింగ్ తీయించారు. కాగా, ఈ విషయమై డీఎస్పీ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా తన భార్యకు ఫిట్స్ వస్తుందని సీఐ శ్రీనివాస్ తన అనుమతితో ఆస్పత్రికి తీసుకువెళ్లాడని చెప్పారు. మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, ఫోరెనిక్స్ రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి విచారణ కొనసాగిస్తామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని సీఐ స్వ గ్రామం బెల్లంపల్లికి తీసుకువె ళ్లారు.