జనగామను జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
జనగామ: జనగామను జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రెండు గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించి నిరసన తెలపడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా జిల్లా కోసం ఆందోళనలు జరుగుతుండగా.. సోమవారం హైవే దిగ్బంధనంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జనగామ జంక్షన్‌ను లోకల్ లారీలతో మూసివేసి సకలజనులు రోడ్డెక్కారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.