వింత శిశువు జననం | baby born with three legs in janagama district | Sakshi
Sakshi News home page

వింత శిశువు జననం

Published Tue, Mar 21 2017 10:20 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

baby born with three legs in  janagama  district

జనగామ: జిల్లా కేంద్రంలో వింత శిశువు జన్మించింది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఓ తల్లి మూడు కాళ్ల పాపకు జన్మనిచ్చింది. జిల్లాలోని రఘునాధపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన జంపన్న, శ్రీలతలకు రెండవ సంతానంగా మూడుకాళ్ల కూతురు జన్మించింది. ఆరు నెలల క్రితం స్కానింగులో ఈ విషయం భయపడింది. గత వారం రోజులుగా ఏరియా ఆస్పత్రి లో శ్రీలతకు వైద్య పరీక్షలను నిర్వహిస్తుండగా.. సోమవారం రాత్రి శ్రీలతకు నొప్పలు రావడంతో కుటుంబ సభ్యులు అస్పత్రకి తీసుకువచ్చారు.

కడుపులో బేబి ఉమ్మనీరు మింగడంతో డాక్టర్ స్వప్న బృందం అర్థరాత్రి ఆపరేషన్ నిర్వహించారు. శ్రీలతకు జన్మించిన పాప మూడు కాళ్లతో ఉండడంతో వైద్యులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. పాప ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నప్పటికి.. మూడు కాలుపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ లోని నీలోఫర్ అస్పత్రికి రెఫర్ చేశారు. మూడుకాళ్లతో జన్మించిన పాపను చూసేందుకు చుట్టపక్కల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement