Strange baby
-
వింత శిశువు జననం..వెయ్యి మందిలో ఒకరే..!
సాక్షి, నిర్మల్ : భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో సోమవారం రాత్రి ఓ గర్భిణి వింత శిశువుకు జన్మనిచ్చింది. మహారాష్ట్రకు చెందిన సదరు గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు భైంసాలోని సాక్షి ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకోచ్చారు. ఆపరేషన్ చేయగా.. వింత శిశువు జన్మించింది. శిశువు తల భాగం పోడువుగా ఉండి, పళ్లు బయటకు రావడం, చర్మ మొత్తం కాలిపోయి ఉన్నట్లు పుట్టింది. అయితే శిశువు మాత్రం ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. వెయ్యి మందిలో ఒకరు ఇలా పుట్టే అవకాశముందని చెబుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో వింత శిశువు జననం
సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. కాళ్లు లేకుండా చేప తోక ఆకారంలో మత్స్యకన్యను పోలినట్టుగా ఆ శిశువు ఉంది. మెదక్ జిల్లా పెద్దశకరంపేటకు చెందిన ఓ మహిళకు గురువారం పురిటి నొప్పులు రావడంతో ఉదయం 11 గంటలకు సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు ఒకటే కాలు ఉంది. కాళ్ల భాగంలో చేప తోకలా ఉండి ఆడో, మగో తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఈ విషయమై ఆస్పత్రి పిల్లల డాక్టర్ అశోక్ ముత్కని నుంచి వివరాలు కోరగా ఆ శిశువుకు జననాంగం లేదని తెలిపారు. జన్మించిన కొద్ది సేపటికే ఆ శిశువును హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తీసుకు వెళ్లాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. ఈ తరహా వింత శిశువు జన్మించడం ఇదేం కొత్త కాదని, జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తారని, లక్షల్లో ఒకరు మాత్రమే ఇలా పుడతారని చెప్పారు. అయితే ఇలా పుట్టిన వారు బతకడం చాలా కష్టమని ఆయన తెలిపారు. కాగా, వైద్యులు నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేసినప్పటికీ నవజాత శిశువును కుటుంబ సభ్యులు సంగారెడ్డి ఆస్పత్రిలోనే ఉంచారు. -
వెనుక తోకతో వింత శిశువు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేటలో వింత శిశువు జన్మించింది, కాసేపటికే కన్నుమూసింది. కార్మికుడు జీకే మూర్తి భార్య చిన్నమ్మ సోమవారం రాత్రి నొప్పులు రావడంతో శనివారసంతేలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే శిశువు మరణించింది. బిడ్డకు ఒకటే కాలు ఉంది, వెనుక తోక లాంటి భాగం ఉంది. ఆడ, మగో తెలుసుకోవడానికి జననాంగాలు కూడా లేవని వైద్యులు తెలిపారు. -
వింత శిశువు జననం
కంప్లి: కణివి తిమ్మలాపుర గ్రామానికి చెందిన హులిగమ్మ అనే మహిళ మంగళవారం పురుటి నొప్పులతో బాధపడుతుండగా, ఆమెను 108 ఆంబులెన్స్‌లో తరలిస్తుండగా సముదాయ ఆరోగ్య కేంద్రం వద్దకు రాగానే అంబులెన్స్‌లోనే జన్మనిచ్చింది. వైద్యాధికారి డాక్టర్ చంద్రమోహన్ తమ సిబ్బందితో కాన్పు చేశారు. సముదాయ ఆరోగ్య కేంద్రంలో కంప్లికి చెందిన సుష్మా అనే యువతి మూడు కాళ్లు, 4 పాదాలు గల మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ కాన్పును కూడా వైధ్యాధికారి డాక్టర్ చంద్రమోహన్ తమ సిబ్బందితో నిర్వహించారు. -
వింత శిశువు జననం
పూతలపట్టు : అసలే పేద కుటుంబం. వింత శిశువు జన్మించడంతో ఆ తల్లిదండ్రులు మాన సిక క్షోభకు గురవుతున్నారు. పూతలపట్టు మండలం తేనేపల్లె ఎస్టీ కాలనీకి చెందిన కూలీ వెంకటేశులు భార్య కుమారి నిండు గర్భి ణిగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాతంలో పురిటి నొప్పులు వ చ్చాయి. కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. అప్పటికే నొప్పులు ఎక్కువయ్యాయి. 108 వచ్చేలోగా ఆమె ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు తల, కాళ్లు, చేతులు, బాగానే ఉ న్నా కడుపు కింద బొడ్డు భాగంలో చర్మం లేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంతలో 108 వాహనం వచ్చింది. సిబ్బంది వెం టనే శిశువును చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో అదే 108లో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి, బిడ్డ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, సెలైన్ ఎక్కించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్సకు తగి న పరికరాలు లేవని, చెన్నై లేదా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని చెప్పి చేతు లెత్తేశారు. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే తమకు అంత స్తోమత లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. చేతిలో ఉన్న రూ.700తో ఆటోలో బిడ్డను తీసుకుని ఇంటికి చేరుకున్నారు. వెంకటేశులు మాట్లాడుతూ ఏం చేయాలో పాలుపోవడం లేదని విలపించాడు. -
వింత శిశువు జననం
జనగామ: జిల్లా కేంద్రంలో వింత శిశువు జన్మించింది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఓ తల్లి మూడు కాళ్ల పాపకు జన్మనిచ్చింది. జిల్లాలోని రఘునాధపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన జంపన్న, శ్రీలతలకు రెండవ సంతానంగా మూడుకాళ్ల కూతురు జన్మించింది. ఆరు నెలల క్రితం స్కానింగులో ఈ విషయం భయపడింది. గత వారం రోజులుగా ఏరియా ఆస్పత్రి లో శ్రీలతకు వైద్య పరీక్షలను నిర్వహిస్తుండగా.. సోమవారం రాత్రి శ్రీలతకు నొప్పలు రావడంతో కుటుంబ సభ్యులు అస్పత్రకి తీసుకువచ్చారు. కడుపులో బేబి ఉమ్మనీరు మింగడంతో డాక్టర్ స్వప్న బృందం అర్థరాత్రి ఆపరేషన్ నిర్వహించారు. శ్రీలతకు జన్మించిన పాప మూడు కాళ్లతో ఉండడంతో వైద్యులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. పాప ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నప్పటికి.. మూడు కాలుపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ లోని నీలోఫర్ అస్పత్రికి రెఫర్ చేశారు. మూడుకాళ్లతో జన్మించిన పాపను చూసేందుకు చుట్టపక్కల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. -
4 చేతులు, 4 కాళ్లతో వింత శిశువు జననం
హొసూరు: కిష్ణగిరి జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో ఓ వింత మగ శిశువు జన్మించింది. 3.4 కిలోల బరువుగల ఈ శిశువుకి మెరుగైన చికిత్స అందించేందుకు చెన్నై యళంబూర్లోని పిల్లల ప్రత్యేక వైద్య కేంద్రానికి తరలించారు. కర్ణాటకలోని క్రిష్ణగిరి జిల్లా హొసూరు తాలూకా పూనపల్లి గ్రామానికి చెందిన మునిస్వామి కార్మికుడు. ఇతనికి 2006లో లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడోసారి గర్భిణి అయిన లక్ష్మి ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. బుధవారం అరరాత్రి పురిటినొప్పులు రావడంతో తల్లితండ్రులు పెరుగోపనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించిన కొద్దిసేపటికే ఆమె మగ శిశువును ప్రసవించింది. చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉండటంతోపాటు కడుపుపై కణితి ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు. జిల్లా వైద్యశాఖ అధికారి అశోక్‌కుమార్, పిల్లల వైద్యులు పరిశీలించి, శిశువును చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. వింత శిశువును చూసేందుకు క్రిష్ణగిరి ఆస్పత్రికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేక వైద్య సదుపాయాలతో శిశువును గురువారం చెన్నైకు తరలించారు. -
మధిరలో వింత శిశువు జననం!
మధిర: ఖమ్మం జిల్లాలోని మధిరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం వింత శిశువు జన్మించింది. వింత శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పుట్టిన వెంటనే శిశువు మరణించిందని, తల్లి ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. వింత శిశువు జనం వార్త బయటకు రావడంతో పెద్ద ఎత్తున జనం చూసేందుకు ఆస్పత్రి వద్దకు వచ్చారు. -
కన్ను మూస్తే కాటికేనట..!
సాక్షి, ఖమ్మం : ‘బుధవారం అర్థరాత్రి.. సమయం 12 గంటలు. అంతా గాఢనిద్రలో ఉన్నారు.. అప్పుడప్పుడే ఒక్కొక్కరి సెల్ఫోన్లు మోగుతున్నాయి..ఇంత అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేశారు...? ఏదైనా వినకూడని వార్త వినాల్సి వస్తుందా..? అంటూ సంశయిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశారు.. అవతలి నుంచి మీరు ఇంకా నిద్రపోతున్నారా.. ఈ విషయం మీకు తెలియదా..? ఫలానా చోట ఆవుకు ఆడ శిశువు జన్మించిందట, ఇంకోచోట ఆవుకు దూడ జన్మించిందట.. ఆ దూడకు మూడు తలలు ఉన్నాయట..! అది మాట్లాడుతోందట.. !! ఇది అనర్థం... నిద్రపోయే వారు చనిపోతారట.. మరోచోట ఓ మహిళకు ఇద్దరు కవల శిశువులు పుట్టారట.. వారు పుట్టిన వెంటనే మాట్లాడుతూ మేము చనిపోతున్నాం.. పడుకున్న వాళ్లంతా మా వాళ్లు... మేల్కొన్న వారు మీ వాళ్లు అని చెప్పారట’ ఇలా వదంతుల కలకలం జిల్లాను చుట్టుముట్టింది. పడుకుంటే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసినట్టేననే పుకార్లు ఒక్కొక్కరికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో ఓ శిశువు పుట్టడంతోనే రాఖీ కట్టుకుని పుట్టాడని, ఆ శిశువు వెంటనే చనిపోయిందని, రాఖీ కట్టుకున్న వారు కూడా చనిపోతారన్న వదంతులు ఆ జిల్లాతోపాటు ఖమ్మం జిల్లాలో కూడా గుప్పుమన్నాయి. దీంతో వేలాదిమంది కట్టుకున్న రాఖీలను విప్పేశారు. ఇది మరువకముందే బుధవారం అర్థరాత్రి ఈ రకమైన వదంతులు జిల్లాలో వ్యాపించాయి. ఒక్కొక్కరి నుంచి మొదలైన ఈ భయాందోళన పదులు, వందలు, వేల సంఖ్యలో ప్రజలను ఆందోళనకు గురి చేసింది. మారుమూల పల్లెలు, తండాలు, గూడేల నుంచి పట్టణాల వరకు అందరిలోనూ కలకలం రేకెత్తించింది. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, భద్రాచలం, ఇల్లందు, అశ్వారావుపేట.. ఇలా ప్రతిచోటా జనం గుమిగూడి ఏం జరుగుతుందోనని చర్చించుకున్నారు. ఈ విషయం ఫోన్లో తమ బంధువు లు, స్నేహితుల ద్వారా తెలుసుకున్న కుటుం బాలు గాఢనిద్రనుంచి మేల్కొని తెల్లవార్లు భయాందోళనలతో గడిపారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు అనర్థమని, వారిని పడుకోనివ్వొద్దని బంధువులు చెబుతుండటంతో పిల్లలున్న వారు వారిని ఒడిలో కూర్చోపెట్టుకుని ముచ్చట్లు చెబుతూ నిద్రపోకుండా చేశారు. ప్రసార మాద్యమాల్లో ఈ విషయం ఏమైనా వస్తుందేమోనని కొంతమంది ఆతృతగా టీవీలు చూశారు. తెల్లవారుజామున పలు చానళ్లలో ఖమ్మం జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లో కూడా ఇలా జాగారం చేస్తున్న విషయాలను ప్రసారం చేయడంతో ఏ ఒక్కరికి నిద్రపట్టలేదు. ఇక్కడ ఇలా జరిగిందట... బయ్యారంలో ఆవుకు వింత శిశువు జన్మించిందని.. తాను చనిపోతున్నానని... పడుకున్న వాళ్లందరినీ తాను తీసుకెళ్తున్నానని... మేల్కొన్న వారు మీ వాళ్లంటూ చెప్పిందని.. ఇది అనర్థమని, ఎవరూ పడుకోవద్దని పలువురు పక్కవారికి తెలపడంతోపాటు ఆ శిశువును తమ పక్క ఇంటి వారు చూసి వచ్చారని చెప్పడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. అలాగే మరికొందరికి కురవి, డోర్నకల్, మహబూబాబాద్, మిర్యాలగూడెంలో ఓ మహిళకు ఇద్దరు కవలలు పుట్టారని, వారు పుట్టగానే మాట్లాడుతూ తాము చనిపోతున్నామని, పడుకున్న వారిని తమతోపాటే తీసుకెళ్తామని చెప్పారని మరికొందరికి ఫోన్లు వచ్చాయి. పడుకోవద్దు... పడుకోవద్దు.... ఈ వదంతులు దావానలంలా వ్యాపించడానికి ప్రధాన కారణం ఒక్క సెల్‌ఫోనే..! మారుమూలన ఉన్న పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి కుటుంబంలో సెల్‌ఫోన్ ఉండటంతో క్షణాల్లోనే వదంతులు వ్యాప్తి చెందాయి. ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందోనని.. వీరు కూడా మరో పదిమందికి ఫోన్ చేసి ఆరాతీశారు. జిల్లాతోపాటు పక్కన ఉన్న వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, కురవి, నర్సంపేట, నల్గొండ జిల్లా కోదాడ, మిర్యాలగూడెం, మేళ్లచెర్వు, హుజూర్నగర్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, తిరువూరు ప్రాంతాలలోనూ ఈ వదంతులు మార్మోగాయి. ఎవరు ఏ ఫోన్ ఎత్తినా కూడా ‘పడుకోవద్దు..ఇలా జరుగుతుందట..జాగ్రత్త’ అని సూచిస్తుండటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొంతమంది అయితే ఏమీ జరగకూడదు... తామంతా క్షేమంగా ఉండాలని తమ ఇష్టదైవాలను ప్రార్థించుకున్నారు. కీడు తొలగిపోతుందనే ఉద్దేశంతో కొంతమంది చిన్నపిల్లలను తడివస్త్రాలతో తుడిచి పడుకోకుండా ఉండేందుకు టీవీల ముందు కూర్చోపెట్టారు. వేలాది మంది తమ బంధువులకు ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేయడంతో కొన్ని ప్రాంతాల్లో నెట్ వర్క్ స్తంభించి ఫోన్లు కలవలేదు. దీంతో మరింత ఆందోళనకు గురయ్యారు. క్షణమొక యుగంగా.... వదంతుల వ్యాప్తితో భయంతో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రజలు క్షణమొక యుగంగా గడిపారు. ఖమ్మం నగరంలో ఉదయం 5 గంటలకు కరెంటు కోత ఉండటం... జిల్లాలోని మండలాలు, పలు గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా మధ్యమధ్యలో నిలిపివేయడంతో చిమ్మచీకటిలో వణికిపోయారు. ఇల్లందు, వైరా, పాలేరు నియోజకవర్గాల్లోని తండాల్లో గిరిజనులు తమ ఇళ్లనుంచి బయటకు వచ్చి రోడ్డుపైనే జాగారం చేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏదో జరుగుతుంది... ఈ రాత్రి గడిస్తే చాలు అనుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు.