వింత శిశువు జననం | Strange baby birth in ST colony | Sakshi
Sakshi News home page

వింత శిశువు జననం

Published Mon, Sep 25 2017 7:51 AM | Last Updated on Mon, Sep 25 2017 7:51 AM

Strange baby birth in ST colony

ఉదర భాగంలో చర్మం లేకుండా జన్మించిన శిశువు

పూతలపట్టు : అసలే పేద కుటుంబం. వింత శిశువు జన్మించడంతో ఆ తల్లిదండ్రులు మాన సిక  క్షోభకు గురవుతున్నారు. పూతలపట్టు మండలం తేనేపల్లె ఎస్‌టీ కాలనీకి చెందిన కూలీ వెంకటేశులు భార్య కుమారి నిండు గర్భి ణిగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాతంలో పురిటి నొప్పులు వ చ్చాయి. కుటుంబసభ్యులు  108 వాహనానికి సమాచారం అందించారు. అప్పటికే నొప్పులు ఎక్కువయ్యాయి. 108 వచ్చేలోగా ఆమె ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు తల, కాళ్లు, చేతులు, బాగానే ఉ న్నా కడుపు కింద బొడ్డు భాగంలో చర్మం లేదు.  దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  ఇంతలో 108 వాహనం వచ్చింది.

సిబ్బంది వెం టనే శిశువును చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తిరుపతి  రుయా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. దీంతో అదే 108లో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి, బిడ్డ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, సెలైన్‌ ఎక్కించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్సకు తగి న పరికరాలు లేవని, చెన్నై లేదా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని చెప్పి  చేతు లెత్తేశారు. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే తమకు అంత స్తోమత లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. చేతిలో ఉన్న రూ.700తో ఆటోలో బిడ్డను తీసుకుని ఇంటికి చేరుకున్నారు. వెంకటేశులు మాట్లాడుతూ ఏం చేయాలో పాలుపోవడం లేదని విలపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement