![Strange Baby Born With Three Legs In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/27/child.jpg.webp?itok=gScgC3dE)
మూడు కాళ్లు, నాలుగు పాదాల మగశిశువు
కంప్లి: కణివి తిమ్మలాపుర గ్రామానికి చెందిన హులిగమ్మ అనే మహిళ మంగళవారం పురుటి నొప్పులతో బాధపడుతుండగా, ఆమెను 108 ఆంబులెన్స్‌లో తరలిస్తుండగా సముదాయ ఆరోగ్య కేంద్రం వద్దకు రాగానే అంబులెన్స్‌లోనే జన్మనిచ్చింది. వైద్యాధికారి డాక్టర్ చంద్రమోహన్ తమ సిబ్బందితో కాన్పు చేశారు. సముదాయ ఆరోగ్య కేంద్రంలో కంప్లికి చెందిన సుష్మా అనే యువతి మూడు కాళ్లు, 4 పాదాలు గల మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ కాన్పును కూడా వైధ్యాధికారి డాక్టర్ చంద్రమోహన్ తమ సిబ్బందితో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment