హొసూరు: కిష్ణగిరి జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో ఓ వింత మగ శిశువు జన్మించింది. 3.4 కిలోల బరువుగల ఈ శిశువుకి మెరుగైన చికిత్స అందించేందుకు చెన్నై యళంబూర్‌లోని పిల్లల ప్రత్యేక వైద్య కేంద్రానికి తరలించారు. కర్ణాటకలోని క్రిష్ణగిరి జిల్లా హొసూరు తాలూకా పూనపల్లి గ్రామానికి చెందిన మునిస్వామి కార్మికుడు. ఇతనికి 2006లో లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మూడోసారి గర్భిణి అయిన లక్ష్మి ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. బుధవారం అరరాత్రి పురిటినొప్పులు రావడంతో తల్లితండ్రులు పెరుగోపనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించిన కొద్దిసేపటికే ఆమె మగ శిశువును ప్రసవించింది. చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉండటంతోపాటు కడుపుపై కణితి ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు. జిల్లా వైద్యశాఖ అధికారి అశోక్‌కుమార్, పిల్లల వైద్యులు పరిశీలించి, శిశువును చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. వింత శిశువును చూసేందుకు క్రిష్ణగిరి ఆస్పత్రికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేక వైద్య సదుపాయాలతో శిశువును గురువారం చెన్నైకు తరలించారు.
4 చేతులు, 4 కాళ్లతో వింత శిశువు జననం
Published Thu, Nov 26 2015 9:23 PM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM
Advertisement