అభివృద్ధి చెందని జనగామ | Undeveloped janagama | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చెందని జనగామ

Published Mon, Apr 28 2014 4:28 AM | Last Updated on Fri, Mar 29 2019 5:32 PM

మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి - Sakshi

మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

జనగామ, న్యూస్‌లైన్ : జనగామను అభివృద్ధి చేయడంలో టీపీసీసీ అధ్యక్షు డు పొన్నాల లక్ష్మయ్య విఫలమయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. జనగామలోని ప్రెస్టెన్ మైదానంలో జనగామ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశాడని, జనం పొన్నాలను మోస్తే.. ఆయన మాత్రం డబ్బు సంచులను మోసుకున్నాడని విమర్శించారు.  పదేళ్లు మంత్రిగా పనిచేసిన పొన్నాల జనగామకు  కనీ సం తాగడానికి నీళ్లు అందించలేదన్నారు. అన్ని విధాలా వెనుకబడ్డ జనగామను అభివృద్ధి చేస్తామన్నారు. జనగామ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

బహిరంగ సభకు వేలాదిమంది కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణ, వన్నాల శ్రీరాములు, నాయకులు కేవీఎల్‌ఎన్ రెడ్డి, సౌడ రమేష్, జనగాం సోమిరెడ్డి, పెద్దోజు జగదీష్, ఉడుగుల రమేష్, శివరాజ్‌యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, జనగామ పట్టణ అధ్యక్షుడు పొకల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement