ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్
అంచనాల్లో తలమునకలు
వరంగల్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలకు మరో రోజు గడువు ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఫలితాల సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. పోలింగ్ తీరును విశ్లేషించుకుంటూ గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. కాలనీల వారీగా జరిగిన ఓటింగ్ తీరు, తమ అనుకూలతలు, ప్రతికూలతలను చర్చిస్తూ లెక్కల్లో మునిగిపోతున్నారు. అనుచరులు, ప్రత్యర్థి పార్టీల్లోని నేతలు ఎవరు కలిసినా ఓటింగ్ తీరుపై వివరాలు తెలుసుకుంటున్నారు. మొత్తంగా అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల్లో ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. పోటాపోటీగా ఎన్నిక జరిగిందని భావి స్తున్న పలు డివిజన్లలో ఎన్నికల ఫలితం ఎలా ఉం టుందో అని అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు వీరి టెన్షన్‌కు ముగింపు పడనుంది. మరోవైపు గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. గ్రేటర్ వరంగల్‌లో మొత్తం 58 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజ న్లలో కలిపి 398 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
మొదటిసారిగా టీఆర్‌ఎస్, బీజేపీలు అన్ని డివిజన్లలో అభ్యర్థులను నిలిపాయి. టీడీపీ 51 డివిజన్లలో పోటీ చేసింది. ఈ మూడు పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ స్థానాల్లో పోటీ చేసింది. 49 డివిజన్లలోనే కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ 11, సీపీఎం 11, సీపీఐ ఆరు, బీఎస్పీ ఒక డివిజన్‌లో పోటీ చేశాయి. టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన వారిలో ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. అందరి భవితవ్యం బుధవారం తేలనుంది.
లబ్... డబ్
Published Tue, Mar 8 2016 1:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement