జనగామ: వరంగల్ జిల్లా జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ జిల్లాసాధన సమితి, ఐకాస, వివిధపార్టీలు ఇచ్చిన బంద్ శుక్రవారం సక్సెస్ అయింది. జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ పట్టణంలో న్యాయవాదులు బైక్‌ర్యాలీ తీశారు. పలుచోట్ల వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకోలకు దిగారు. అభివృద్ధి పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి భూపాలపల్లి వెళ్తున్న మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ను ఓ వ్యక్తి అడ్డుకోబోయారు. పోలీసులు అప్రమత్తమై అతని అదుపులోకి తీసుకున్నారు.