separate
-
డబ్బు చేసే మాయ.. 34 ఏళ్ల ఎడబాటుని అమాంతం..!
కుటుంబానికి దూరమై కష్టాల కడలిలో బతుకును సాగించాడు. తనవాళ్లెవరో తెలియక నానా బాధలు పడ్డాడు. అలా 34 ఏళ్లు గడిచిపోయాయి. తీరా తన కుటుంబాన్ని కలుసుకుంటే.. మళ్లీ డబ్బు రూపంలో వచ్చిన స్వార్థం ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది. ఎంతలా అంటే.. కుటుంబాన్నే వద్దనుకునే దాకా!!. ఈ కథ వింటే.. డబ్బు బంధాలతో ఇంత ఘోరంగా ఆడుకుంటుందా..! అని ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన 37 ఏళ్ల యూ బావోబావో రెండేళ్ల ప్రాయంలో తన అమ్మమ్మ ఇంటి నుంచి అపహరణకు గురై మానవ అక్రమ రవాణదారుల ముఠా(హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్) చేతిలో చిక్కుకున్నాడు. అలా అక్కడ నుంచి ఓ ధనిక కుటుంబానికి విక్రయించబడ్డాడు. ఆ కుటుంబ సభ్యులు యు బాగోగులు చూడకపోగా.. హింసించింది. అయితే.. ఆ తర్వాత ఐదేళ్లకు మరో కుటుంబానికి దత్తతగా వెళ్లాడు. అలా 11వ ఏడు రాగానే మళ్లీ మరో కుటుంబం చెంతకు చేరాడు యూ. ఇక యు వాళ్లందరితో పడిపడి విసిగివేశారి బయటకొచ్చేశాడు. సరిగ్గా 19 ఏళ్లు రాగానే బీజింగ్‌కు చేరకుని అక్కడ డెలివరీ రైడర్‌గా స్థిరపడ్డాడు. అదే టైంలో.. తాను పుట్టిన కుటుంబం ఆచూకీ కోసం ఎంతగానో అన్వేషిస్తూ ఉన్నాడు. సరిగ్గా అతడి డీఎన్ఏ మ్యాచ్ అయిన కుటుంబ వివరాలు గురించి పోలీసులు తెలియజేయడంతో యూ ఆనందానికి అవధులు లేకుండాపోయింది. తన కుటుంబాన్ని కలుసుకుని తన తల్లి ఒడిలో సేదతీరాలనుకున్నాడు. కానీ, యుకి ఆ క్షణంలో తెలియలేదు ఈ భావోద్వేగభరిత ఆనందం ఎంతో కాలం నిలవదని. తీరా అక్కడకు వెళ్లాక యుకి..తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, తనకి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ తర్వాత యూ చేసిన స్ట్రీమింగ్ వ్యాపారం లాభాల బాటపట్టింది. అయితే తన కుటుంబ ఒత్తిడి మేరకు 60% ఆదాయాన్ని తన ఇద్దరు తమ్ముళ్లుతో పంచుకునేందుకు అంగీకరించాడు. అంత చేసినా.. యూకి తన మొత్తం సంపాదనలో న్యాయబద్ధంగా తనకు రావాల్సిన వాట వచ్చేది కాదు. పైగా కొత్తగా చేరువయ్యిన తోబుట్టువులు మా కుటుబంలోని వ్యక్తిగా అంగీకరిస్తున్నాం కాబట్టి నీ స్వార్జితంలో వాటా ఇవ్వాల్సిందే అని శాసించడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగక 'దత్తపుత్రుడు' అని పిలుస్తూ గేలి చేయడం వంటివి చేశారు. దీనికి తోడు తల్లి కూడా తన ఇద్దరు పిల్లలపై ప్రేమతో పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తూ.. యూని డబ్బులు కోసం వాడుకోవడం మొదలుపెట్టింది. దీంతో తీవ్ర నిరాశ నిస్ప్రుహలకు గురై..చివరికి కుటుంబాన్ని వదిలేద్దామన్న విరక్తికి వచ్చేశాడు. ఈ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా వివరించాడా వ్యక్తి. అంతేగాదు తన సంపాదనంత తనలా హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడ్డ బాధితుల కోసం ఖర్చు చేయాలనుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. డబ్బు ఎంత గొప్పదో.. అంత చెడ్డది అని కొందరు ఆ యూ పోస్ట్‌కు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!) -
ఆ ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్.. కారణమిదే?
నాగాలాండ్‌లోని ఆరు తూర్పు జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది తొమ్మిది గంటల పాటు వేచి ఉన్నప్పటికీ ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు. ‘ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ’ (ఎఫ్ఎన్టీ) బంద్ పిలుపుతో ఈ ప్రాంతంలోని నాలుగు లక్షల మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీఓ)ఎఫ్ఎన్టీ డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదని ముఖ్యమంత్రి నీఫియు రియో వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్త అధికారాలను సిఫారసు చేశారన్నారు. కాగా 20 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ప్రాంతంలోని 738 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సిబ్బంది ఉన్నారని నాగాలాండ్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవ లోరింగ్ తెలిపారు. అయినప్పటికీ ఓటు వేసేందుకు ఎవరూ రాలేదని సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. నాగాలాండ్‌లోని 13.25 లక్షల మంది ఓటర్లలో తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఓటర్లు ఉన్నారు. కాగా తౌఫెమాలో ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఎఫ్‌ఎన్‌టీకి సంబంధించిన ‘డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్’ను కేంద్ర హోంమంత్రికి అందజేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాన్ని విస్మరించాయని ఆరోపిస్తూ ఈఎన్‌పీవో ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. నాగాలాండ్‌లో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈఎన్‌పీవో గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో నిరవధిక బంద్‌ను ప్రకటించింది. -
Babu In Jail: తొలి రోజు గడిచిందిలా..
సాక్షి, అమరావతి, సాక్షి, రాజమహేంద్రవరం: పొద్దున్నే యోగా.. కాసేపు పత్రికల పఠనం... ప్రత్యేకంగా తెప్పించిన ఆహారం... రెండు సార్లు వైద్య పరీక్షలు.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా తొలిరోజు గడిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీ 7691గా ఉన్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, పూర్తి భద్రతతో కూడిన ప్రత్యేక గదిలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రత్యేకంగా సహాయకుడు.. వంటకు ప్యాంట్రీ కార్ న్యాయస్థానం ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్‌లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. అందులో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఆయన కాన్వాయ్‌లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్‌ను జైలుకు సమీపంలో ఉంచారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద మకాం వేసి చంద్రబాబుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు. ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్‌తో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని పంపారు. మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలిసింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్‌కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు. నిరంతరం 1 + 4 భద్రత జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రతతోపాటు జైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిస్థాయి భద్రత నడుమ ఉన్నారు. తొలిరోజు ములాఖత్‌లు లేవు సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును తొలిరోజు ఎవరూ కలవలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్‌లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేష్ మంగళవారం ఆయన్ను ములాఖత్‌లో కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. -
విడిగా వివిధ బిజినెస్‌ల లిస్టింగ్: అనిల్ అగర్వాల్ మెగా ప్లాన్
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గ్రూప్‌లోని బిజినెస్‌లను విడిగా లిస్ట్ చేయాలని భావిస్తోంది. వాటాదారులకు మరింత విలువ చేకూర్చేబాటలో అల్యూమినియం, ఇనుము–ఉక్కు, చమురు–గ్యాస్ తదితర విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే యోచనలో ఉన్నట్లు వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ తాజాగా పేర్కొన్నారు. మాతృ సంస్థ వేదాంతా రీసోర్సెస్ వీటన్నిటికీ హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. (మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?) వాటాదారులకు వీడియో సందేశం ద్వారా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. మెటల్స్ అండ్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితరాలను విడిగా లిస్ట్ చేయడం ద్వారా భారీగా వృద్ధి చెందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వెరసి వేదాంతా లిమిటెడ్‌లో 1 షేరుని కలిగి ఉంటే పలు కంపెనీలలో షేర్లను పొందేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. (పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?) తొలుత 2021 నవంబర్‌లో అగర్వాల్ బిజినెస్‌ల విడదీత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితరాల ద్వారా కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం, సరళీకరించడం ద్వారా వాటాదారులకు లబ్ది చేకూర్చాలని భావించారు. దీర్ఘకాలిక వృద్ధికి తెరతీయాలని ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం ఇందుకున్న అవకాశాలపై వాటాదారులు, తదితరుల అభిప్రాయాలకు ఆహా్వనం పలుకుతున్నారు. రెండు దశాబ్దాలుగా.. గత రెండు దశాబ్దాలలో వేదాంతా దిగుమతుల ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో ఆయా విభాగాలలో ప్రవేశించడం అత్యంత క్లిష్టతరమని అభిప్రాయపడ్డారు. ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు భారీ స్థాయిలో అల్యూమినియంను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ బాటలో సమీకృత విద్యుత్, కాపర్, జింక్, సిల్వర్, లెడ్, ఐరన్ అండ్ స్టీల్, నికెల్, ఫెర్రోఅల్లాయ్స్, సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ తదితర మరిన్ని విభాగాలలో కార్యకలాపాలు విస్తరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఇవన్నీ వేదాంతా గొడుగుకిందనే ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం ప్రపంచమంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు స్వతంత్ర కంపెనీలపట్లనే ఆసక్తి చూపుతారని, ప్రత్యేక కంపెనీగా విడిపోవడం ద్వారా కీలక బిజినెస్‌పై దృష్టి సారించగలుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు తమకిష్టమైన రంగాలు, కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని వివరించారు. తద్వారా ఉత్తమ రిటర్నులతోపాటు డివిడెండ్లు అందుతాయని అంచనా వేశారు. -
మనుషులే కాదు, ఇప్పుడు పక్షులు కూడా విడాకులు
-
అచ్చం మనుషుల్లా..పక్షలు కూడా విడాకులు తీసుకుంటున్నాయట!
మనుషులకు ఏం తీసిపోం అన్నట్లుగా పకులు కూడా బిహేవ్ చేస్తున్నాయి. ఔను అవి కూడా మనుషుల మాదిరి విడాకులు తీసుకుంటున్నాయట. అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని పరిశోధకులు అంటున్నారు. అవి విడాకులు తీసుకునేందుకు దారితీసిన పరిస్థితులను చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే..మనుషుల్లాగే పక్షలు కూడా తమ భాగస్వాములకు విడాకులు ఇస్తున్నట్లు పరిశోధకులు వివిధ జాతి పక్షులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందట. ఈ మేరకు చైనా, జర్మనీకి చెందిన పరిశోధకులు దాదాపు 232 పక్షి జాతులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 90 శాతం కంటే ఎక్కువ పక్షి జాతులు సాధారణంగా ఒకే సహచరుడితో సంతానోత్పత్తి కాలం వరకు ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఐతే కొన్ని పక్షలు మాత్రం తమ సహచరుడు జీవించి ఉన్నప్పటికీ తదుపరి సంతానోత్పత్తి సీజన్లలో కొత్త భాగస్వామిని వెతుకుంటున్నాయని చెబుతున్నారు. ఈ ప్రవర్తనను 'విడాకులుగా' సూచించారు పరిశోధకులు. దీనికి ప్రధాన కారణం 'వలసలు' అని అన్నారు. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ పరిశోధకుడు డాక్టర్ జిటాన్ సాంగ్ మాట్లాడుతూ..సంతానోత్పత్తి కాలంలో పుట్టిన పక్షలు బాధ్యతలను మగపక్షులు చూడటంతో.. ఆడపక్షులు తదుపరి సంతానం కోసం వేరేవాటితో జత కట్టేందుకు వెళ్లిపోతున్నట్లు తెలిపారు. అలాగే సుదీర్ఘ దూరాలకు వలస వెళ్లినప్పుడూ తమ పాత భాగస్వామి కోసం వేచి ఉండకుండా కొత్త భాగస్వామితో జత కట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు గమనించారు. ఎక్కువ వలసలు వెళ్తున్న పక్షల జాతుల్లోనే ఈ విడాకుల రేటు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. పునరుత్పత్తి లేదా వలసల కారణంగా అవి విడిపోతున్నాయని, కొత్త భాగస్వాములను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొన్ని పక్షులు మాత్రం తమ పాత భాగస్వామితో ఉండటం లేదా అవి లేనట్లయితే ఒంటరిగా ఉండిపోవటం జరుతుందని అన్నారు. దీనంతటికి కారణం మనిషేనని, అందువల్లే అవి మన మాదిరిగా విడిపోతున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. తన స్వార్థ కోసం అభివృద్ధి పేరుతో చెట్లు నరకడం, వాటికి ఆవాసం లేకుండా చేయడం తదితర కారణాల రీత్యా అవి వలస బాటపట్టడంతో..పక్షలుకు కూడా ఆ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. (చదవండి: తెలుసా! గోళ్ల ఆకారాన్ని బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు!) -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై... విడిగా విచారణ: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని జమ్మూకశ్మీర్ కేసుతో కాకుండా విడిగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్, తెలుగు రాష్ట్రాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల ధర్మాసనం విచారించింది. జమ్ము కశ్మీర్ అంశంతో తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఎలా జత చేస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. జమ్ము కశ్మీర్ చట్టం 2019లో చేశారని, ఏపీ పునర్విభజన చట్టం 2014లోనే చేశారని పిటిషనర్ పురుషోత్తం రెడ్డి తరఫు న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, రావు రంజిత్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏకీభవించని ధర్మాసనం జమ్మూకశ్మీర్ అంశంతో తెలుగు రాష్ట్రాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో సీట్లపెంపు పిటిషన్లను వేరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. -
Azadi Ka Amrit Mahotsav: విభజన నెహ్రూ పుణ్యమే బీజేపీ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ: విభజన గాయాల స్మారక దినం సందర్భంగా ఆదివారం బీజేపీ విడుదల చేసిన వీడియో వివాదానికి దారి తీసింది. 1947లో దేశ విభజనకు దారి తీసిన ఘట్టాలను అందులో చూపించారు. పాకిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న ముస్లిం లీగ్ డిమాండ్‌కు నెహ్రూ తలొగ్గారంటూ ఆరోపించారు. వీడియో అంతా పదే పదే నెహ్రూ విజువల్స్ చూపించారు. ఈ వీడియోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆధునిక సావర్కర్లు, జిన్నాలు ఇప్పటికీ జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు విభజన విషాదాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల థియరీని తెరపైకి తెచ్చింది బీజేపీ ఆరాధించే సావర్కరేనని ఆరోపించారు. దాన్ని జిన్నా అందుకున్నారన్నారు. విభజనకు ఒప్పుకోకుంటే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి దేశం సర్వనాశనం అయ్యేదన్నారు. భారతావనని ఏకతాటిపైకి తెచ్చేది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీయేనని జైరాం అన్నారు. -
ఆషాఢ ఎడబాటు వెనుక.. ఆచారం.. ఆంతర్యం ఇవే..
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభకార్యాలు చేయకూడదని పెద్దలు విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. కొత్త దంపతులకు ఆషాఢం విరహ మాసం. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన అనివార్యమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన తరుణం. చూసుకోవడానికి కూడా వీల్లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే దుష్పరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. మారిపోయిన ప్రస్తుత కాలంలో నెల రోజుల ఎడబాటు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త దంపతుల ఎడబాటు అనివార్యం అనే సంప్రదాయం సడలింపు దిశగా సాగిపోతోంది. ఫార్మాలిటీ కోసం ఓ 5 రోజులపాటు పుట్టింటికి వెళ్లి వస్తే చాలు అనే భావన కొందరు వెలిబుచ్చుతున్నారు. పెద్దల నియమం కూడా మంచికే అనుకునే వాళ్లూ ఉన్నారు. అయితే ఎడబాటు కూడా మంచికే అన్నది పెద్దల నిశ్చితాభిప్రాయం. ఆచారం.. ఆంతర్యం ఇవే.. ఆషాఢ మాసం నవ దంపతులను దూరంగా ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి కొత్త కోడలు అత్తగారి ముఖం చూడకూడదు. అలాగే కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదు అనే ఆచారం తరతరాలుగా వస్తోంది. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీ లేవు. మృగశిర నుంచి మొదలయ్యే చినుకుల ఆగమనం.. క్రమంగా ఆషాఢ మాసం ప్రవేశించే సరికి సమృద్ధిగా వర్షాకాలం అవుతుంది. సాగు ప్రధాన వృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాది అదే పనుల్లో తలమునకలవుతారు. దీంతో కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. పని ఆధారిత ప్రాంతాల్లో చేసే వృత్తిని కాదని మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం విధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని అనుసరిస్తున్నారు. సంప్రదాయం వెనక శాస్త్రీయత నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో అత్తగారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు నిలిచిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండటం అంత మంచిది కాదంటారు. ఈ సమయంలో గర్భధారణ జరగడం తల్లీబిడ్డలకు అంత క్షేమం కాదు. ఆషా«ఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా జలాశయాలు, పరిసరాల్లోని నీళ్లు కలుషితం అవుతాయి. ఈ నీటి వినియోగం అనారోగ్యాలకు కారణమవుతుంది. చలిజ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చీడపీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్ర వచనం. ప్రత్యామ్నాయాలు బోలెడు ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఆ భావనను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాల ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. దూరంగా ఉండటమే శ్రేయస్కరం ఆషాఢ మాసంలో విడిగా ఉండటం శ్రేయస్కరమే. ఈ సమయంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో అవుతుంది. అధిక ఉష్ణోగ్రతల సమయంలో శిశువు జన్మిస్తే బాహ్య పరిసరాలను భరించడం కష్టమవుతుంది. ఆషాఢ మాసంతోపాటు పూజలు, నోముల పేరుతో శ్రావణంలో ఎడబాటు కొనసాగిస్తే సంతానోత్పత్తి› సమయాన్ని జూలై, ఆగస్టు వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సుఖ ప్రసవానికి అనువుగా ఉంటుంది. – డాక్టర్ గీతావాణి, గైనకాలజిస్టు వివాహ బంధం బలోపేతం ఆషాఢ మాసం కొత్త దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో ఈ నియమం చాలా బాగా పని చేస్తుంది. ఆషాఢ మాసంతో పరస్పర అభిప్రాయాలను పంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా వివాహ బంధం బలోపేతం అవుతుంది. – బోయిని గౌతమ్, హారిక సంప్రదాయాన్ని పాటిస్తున్నాం పెద్దవాళ్లు ఏ నియమం పెట్టినా అది పిల్లల మంచి కోసమే. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం వల్ల సమస్యేమీ లేదు. పైగా ఇప్పుడు సెల్‌ఫోన్ లాంటి సాంకేతిక పరికరాలు మనుషులను కలిపే ఉంచుతున్నాయి. పెద్దవాళ్లు వి«ధించిన నియమ నిబంధనలు శాస్త్రీయ కోణంలోనే చూడకుండా, ఆరోగ్యం దృష్ట్యా పాటిస్తే మేలు కలుగుతుంది. అందుకే మేము ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. – గూడెల్లి సురేశ్, వాసవి, సాఫ్ట్వేర్ దంపతులు 5 రోజులు తీసుకెళ్లారు పిల్లలు బాగుండాలనే పెద్దలు అనేక నియమాలను వి«ధించారు. టైమ్‌తో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేసుకునే కాలంలో ఇలాంటి ఇవి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి సంప్రదాయం కోసం ఐదు రోజులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఎడబాటుతో అన్యోన్యత కూడా పెరుగుతుంది కాబట్టి ఆషాఢ నియమం మంచిదే. – గోవిందు భరత్‌కుమార్ (ప్రైవేట్ ఉద్యోగి), పద్మజ -
టాటా గ్రూపునకు ఎస్పీ గ్రూప్ టాటా
సాక్షి, ముంబై: టాటా సన్స్, సైరస్ మిస్త్రీ మధ్య రగిలిన కార్పొరేట్ వార్ మరింత ముదిరి తమ బంధానికి వీడ్కోలు పలకడానికే టాటా గ్రూపు షాపూర్జీ పల్లొంజీ కంపెనీలు సిద్దమయ్యాయి. దీంతో రెండు కార్పొరేట్ దిగ్గజాల మధ్య ఏడు దశాబ్దాల బంధానికి త్వరలో తరపడనుంది. బిలియనీర్ మిస్త్రీ కుటుంబానికి చెందిన ఎస్పీ గ్రూప్ టాటా సన్స్ వాటాలను విక్రయించి నిధులను సమీకరించాలని భావించింది. ఈ మేరకు పల్లోంజీ గ్రూపు సుప్రీంలో అఫడివిట్ దాఖలు చేసింది. అయితే టాటా సన్స్ దీనిపై అభ్యంతరం చెప్పడంతో వాటాలను తాకట్టు పెట్టడం లేదా అమ్మకంపై స్టేటస్ కో ఇచ్చింది. దీనిపై అక్టోబర్ 28 న తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీం కోరింది. దీంతో అసలు పూర్తిగానే కంపెనీనుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది షాపూర్జీ పల్లొంజీ ప్రమోటర్స్ మిస్త్రీ కుటుంబం. అయితే ఇందుకు న్యాయమైన, సహేతుకమైన పరిష్కారం కావాలని ప్రకటించింది. పల్లోంజీ వాటా కొనుగోలు చేస్తామని టాటా సన్స్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాము టాటా గ్రూపునుంచి బయటకు రావాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. టాటా సన్స్ లో లిస్టెడ్ కంపెనీలు నష్టాలు, ఆయా కంపెనీల్లో షేర్ హోల్డర్స్ ప్రయోజనాలు కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్పీ గ్రూపు తెలిపింది. టాటా గ్రూప్ కంపెనీలలో గత మూడేళ్లలో సుమారు 11,000 కోట్లుకు పెరిగాయని పేర్కొంది. అయితే టాటా గ్రూపు దీన్ని అడ్డుకోవడాన్ని కంపెనీ తప్పుబట్టింది. 70 ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య నమ్మకం, స్నేహం, పరస్పర అవగాహనతో వ్యాపారబంధం కొనసాగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదని తెలిపింది. బరువైన మనసుతో బయటకు రావాల్సి వస్తుందని షాపూర్జీ పల్లోంజీ వ్యాఖ్యానించింది. దేశంలోనే అతిపెద్ద గ్రూపు టాటా సన్స్ లో మిస్త్రీ కుటుంబం 18.37 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఉంది. తన వాటాకు 1.78 ట్రిలియన్ల రూపాయలు ఎస్పీ గ్రూప్ అంచనా వేస్తోంది. అయితే ఎస్పీ వాటాలను ఎంతకు కొనుగోలు చేసేదీ, సమయ పరిధి టాటా ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయనీ, ఇది కీలక అడుగు అని సీనియర్ కార్పొరేట్ న్యాయవాది ఎస్ పి రనినా అన్నారు. కాగా అక్టోబర్, 2016లో టాటా సన్స్ ఛైర్మన్ పదవినుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తరువాత వివాదం రగిలింది. టాటా గ్రూప్, మిస్త్రీల మధ్య న్యాయ పోరు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా మిస్త్రీ కుటుంబం నిధులు సేకరించే పనిలో ఉంది. అంతేకాకుండా తన లిస్టెడ్ కంపెనీకి ఎస్ అండ్ డబ్ల్యూ సోలార్ నుంచి రుణాలపై బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత ఆస్తుల అమ్మకానికి సిద్ధపడుతోంది. -
నేను ఒక్కదాన్నే ఉంటాను
మనిషి కలిసి ఉండాలి. అమ్మ, నాన్న.. భార్య, భర్త... తల్లి, పిల్లలు... కాని దేశంలో దాదాపు ఆరుశాతం మంది స్త్రీలు ఈ బంధాలను ఎడంగా ఉంచి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. దక్షిణాదిలో వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. సపరేటెడ్/డివోర్సీ/వితంతువు... ఈ స్త్రీలు తిరిగి ఏ బంధంలోకీ వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కుటుంబాలతో కూడా ఉండటం లేదు. ఎందుకు? (కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన సేవలు) సుజాతగారి ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఇంకో అబ్బాయి ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు. సుజాతగారు టీచర్‌గా రిటైర్ అయ్యారు. భర్త చనిపోయాక ఆమె తన ఇంట్లోనే ఉంటరిగా ఉంటున్నారు. అమెరికాకు వెళ్లడం లేదు. రెండోకొడుకు ఇంట్లో ఉండి కోడలి ప్రేమను తగ్గించుకోవడమూ ఇష్టం లేదు. ఇలా బాగానే ఉంది అనుకున్నారామె. రజితకు 40 ఏళ్లు. పిల్లలు లేరు. భర్త చనిపోయాడు. ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం చేసుకుంటూ ఒక్కతే ఉంటోంది. మొదటి పెళ్లిలో అత్తామామల నుంచి చాలా హింస పడింది. భర్త హఠాన్మరణం కూడా ఆమెను బెంబేలెత్తించింది. కొత్త బంధంలో ఏ సమస్యలు, చికాకులు ఉన్నాయో. ఇలా బాగానే ఉంది అని అనుకుని ఉండిపోయింది. రాధకు భర్తతో సరిపడలేదు. పదేళ్ల కూతురు ఉంది. భర్తతో విడివడి కూతురే లోకం అనుకుంటూ ఉంది. మరో పెళ్లి అనే ఆలోచన ఆమె ఎదుట అనేక ప్రశ్నలను ఉంచుతోంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోలేక ఒంటరిగా ఉండిపోయింది. ఇటీవల కూతురి కోసం ఒక కుక్కపిల్లను కొన్నది. వాళ్లిద్దరికి ఇప్పుడు కుక్కపిల్ల తోడు. స్త్రీలు ఒంటరిగా ఉండగలరు.. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు అని తాజా గణాంకాలు చెబుతున్నాయి. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్– 2018 గణాంక నివేదిక ప్రకారం దేశంలో 5.5 శాతం మంది స్త్రీలు వివాహం అయ్యాక అనేక కారణాల రీత్యా ఒంటరిగా ఉంటున్నారు. విడాకులు లేకుండా విడిపోయి, విడాకులతో విడిపోయి, భర్త చనిపోయి... కారణాలు ఏవైనా వీరంతా ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే కేరళ, తమిళనాడుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంది. కేరళలో ఒంటరిగా ఉంటున్న స్త్రీలు 9.3 శాతం అయితే తమిళనాడులో 9.1 శాతం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లో 7.8 శాతం, తెలంగాణలో 7.1 శాతం ఉన్నారు. కాని వివాహం అనంతరం వివిధ కారణాల వల్ల ఒంటరిగా ఉంటున్న పురుషుల సంఖ్య కేవలం 1.5 శాతం మాత్రమే. అంటే మగవారు ఎలాగోలా ఒక స్త్రీతోడును వెతుక్కుంటుంటే స్త్రీలు మగతోడును వద్దనుకుంటున్నారు. ఒంటరి స్త్రీల సంఖ్య దక్షణాదిలో పెరగడానికి మైక్రోఫ్యామిలీ సిస్టమ్ ఒక ప్రధాన కారణం అని నిపుణులు భావిస్తున్నారు. పెళ్లయిన వెంటనే పిల్లలు వేరు కాపురాలు పెట్టడానికి ఆత్రపడటం వల్ల తల్లిదండ్రులు వేరుగా ఉండాల్సి వస్తోంది. వీరిలో వయసు వ్యత్యాసం వల్ల భర్త ముందు చనిపోతే భార్య ఒక్కతే ఉండాల్సి రావడం కేరళ, తమిళనాడుల్లో ఎక్కువగా కనిపిస్తోందని పరిశీలనలో తెలుస్తోంది. దక్షణాది రాష్ట్రాలలో అబ్బాయి వయసు అమ్మాయి వయసు కంటే ఎక్కువగా ఉండటం (దాదాపు 10 సంవత్సరాల వరకు) వల్ల కూడా భర్తల మరణం తర్వాత స్త్రీలు ఒంటరి జీవితానికి నిబద్ధులు అవుతున్నారు. కొద్దోగొప్పో చదువు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి మార్గాలు ఇవన్నీ వివాహం నుంచి బయటపడ్డ స్త్రీకి, సంతానం వద్ద ఉండే వీలు లేని స్త్రీకి/ పిల్లలు ఉండనివ్వని స్త్రీకి తన కాళ్ల మీద తాను నిలబడేలా చేస్తున్నాయి. కాని పిల్లల కోసం, సంఘ మర్యాద కోసం ‘టెక్నికల్’గా కలిసి ఉంటూ ఒకే ఇంటికప్పు కింద శారీరకంగా/ మానసికంగా ఒంటరిగా ఉన్న స్త్రీల గణన జరిగితే ఈ శాతం ఎంత ఉంటుందో ఊహించలేము. వివాహంలో సమ గౌరవం, సమ విలువ స్త్రీకి సంపూర్ణంగా లభించాల్సి ఉంది. వివాహ వ్యవస్థను నిలబెట్టుకోవడానికి పురుషుడు ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడో, వివాహ వ్యవస్థలో స్త్రీకి ఉండే అభద్రత దూరం చేయడానికి సంఘం ఏమేరకు ప్రయత్నిస్తూ ఉందో తేలే వరకు ఒంటరిగా ఉండే స్త్రీల శాతం పెరుగుతూ పోతూ ఉండొచ్చు. గతంలో కేవలం కేరళలో మాత్రమే అధికంగా కనిపించే ఒంటరి మహిళలు ఇవాళ దక్షిణాది రాష్ట్రాలలో ఉత్తరాది కంటే అధికంగా కనిపించడానికి కారణాలు సంపూర్ణంగా అర్థం చేసుకుంటే స్త్రీలు ఒకరితో కలిసి ఉండగలిగే ఆనందమైన జీవితాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
‘ప్రత్యేక జెండా ఉండకూడదన్న నిబంధన లేదు’
కర్ణాటక, బెంగళూర్ : కర్ణాటకలోని సిద్ధ రామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం అన్నంత పని చేసింది. రాష్ట్రం కోసం కొత్త జెండాను రూపకల్పన చేసిన అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు దానిని ఆవిష్కరించింది. గురువారం ఉదయం విధాన సౌధాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో ఉన్న నాడా ద్వజ(జెండా) రాష్ట్ర చిహ్నం గంఢ బెరుండను, రెండు తలల పక్షిని కలిగి ఉంది. ప్రత్యేక జెండాకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయగా.. ఆవిష్కరణానంతరం ఏర్పాటు చేసిన కమిటీని సిద్ధరామయ్య అభినందించారు. ఈ జెండాను కేంద్రం ఆమోదం కోసం పంపనున్నారు. ‘రాష్ట్రాలకు ప్రత్యేక జెండా ఉండకూదన్న నిబంధన రాజ్యాంగంలో పొందుపరచలేదు. అలాంటప్పుడు కర్ణాటకకు ప్రత్యేక జెండా ఉంటే తప్పేం కాదు’ అని ఈ సందర్భంగా సిద్ధరామయ్య మీడియాకు తెలిపారు. అప్పట్లో ఈ ప్రతిపాదనపై ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకత ప్రదర్శించగా.. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర జెండాకు ఆమోదం లభించటం అనుమానమే. అయితే త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. -
నల్లగొండలో మరో హత్య ; తల నరికి జెండాదిమ్మెపై..
సాక్షి, నల్లగొండ : వరుస దారుణకాండలు నల్లగొండ జిల్లాలో కలకలంరేపుతున్నాయి. కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ మర్డర్ కేసు మరువకముందే మరో వ్యక్తి అతిదారుణంగా హత్యకుగురయ్యాడు. సోమవారం ఉదయం నల్లగొండ పట్టణం బొట్టుగూడలోని ఓ జెండాదిమ్మెపై తెగిపడిన తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తల పాలకూరి రమేశ్‌దిగా పోలీసులు గుర్తించారు. ఎవరు చేశారీ ఘాతుకం?: హతుడు రమేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న అతను.. మందుతు తెచ్చుకుంటానని ఇంట్లోవాళ్లకు చెప్పి ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటికొచ్చాడు. గుర్తుతెలియని దుండగులు రమేశ్‌ను కిరాతకంగా చంపి, తలను, మొండెంను వేరుచేశారు. అనంతరం తలను తీసుకొచ్చి బొట్టుగూడలోని జెండాదిమ్మెపై ఉంచివెళ్లారు. సమాచారం తెలిసన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాడ్‌స్క్వాడ్ సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక్కడి భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద రమేశ్ మొండేన్ని గుర్తించారు. ఈ హత్యచేసింది ఎవరు, ఇందుకు దారితీసిన పరిస్థిలేమిటనే విషయాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. కాగా, వివాహేతర సంబంధమే రమేశ్ మరణానికి కారణమై ఉంటుందని తెలిసింది. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణకావాల్సిఉంది. కొద్ది రోజుల కిందటే నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురికావడం రాజకీయంగా కలకలంరేపింది. అధికార పార్టీకి చెందిన గుండాలే నిందితులని విపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. శ్రీనివాస్ హత్య కేసులో నిదితులను పోలీసులు అరెస్టుచేశారు. ఒకప్పుడు క్రైమ్ డెన్‌గా ఉన్న నల్లగొండలో కొంతకాలంగా ప్రశాంత నెలకొంది. కానీ వరుస హత్యాకాండలు మళ్లీ పాతరోజులను గుర్తుచేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. -
ఆచూకీ తెలపండి
పోలీసులకు సహకరించండి డీఎస్పీ రామాంజనేయులు తాడేపల్లి (తాడేపల్లిరూరల్) : ‘నిందితుల ఆచూకీ తెలపండి.. పోలీసులకు సహకరించండి’.. అంటూ మంగళగిరి రూరల్ డీఎస్పీ రామాంజనేయులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తిని అతి కిరాతకంగా మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. చనిపోయిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొండెం నుంచి తల వేరైన వ్యక్తి ముఖ చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిసిన వారు 94407 96216, లేదా 94407 96392 నంబర్లకు వివరాలు ఇవ్వాలన్నారు. -
జనగామ బంద్ సక్సెస్
జనగామ: వరంగల్ జిల్లా జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ జిల్లాసాధన సమితి, ఐకాస, వివిధపార్టీలు ఇచ్చిన బంద్ శుక్రవారం సక్సెస్ అయింది. జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ పట్టణంలో న్యాయవాదులు బైక్‌ర్యాలీ తీశారు. పలుచోట్ల వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకోలకు దిగారు. అభివృద్ధి పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి భూపాలపల్లి వెళ్తున్న మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ను ఓ వ్యక్తి అడ్డుకోబోయారు. పోలీసులు అప్రమత్తమై అతని అదుపులోకి తీసుకున్నారు. -
మహిళా వ్యాపారవేత్తలకు ప్రత్యేక 'మార్కెట్'..!
మహిళా వ్యాపారవేత్తలకు విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ హామీల వర్షం కురిపించారు. క్యాప్టివ్ మార్కెట్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. రెండు రోజుల ఇంటరాక్టివ్ టూర్ సందర్భంగా ముంబైలోని మహిళా స్వయం సహాయక బృందాలతో మాట్లాడిన ఆమె... కేంద్రంలోని మోదీ సర్కారు ఇప్పటికే సాధించిన విజయాలను వివరించారు. మహిళాభివృద్ధకి తమ ప్రభుత్వం కృషిచేస్తోందని సుష్మా స్వరాజ్ అన్నారు. మహిళలు తమ ఉత్పత్తులను ఒకే దుకాణంలో అమ్మడం వల్ల తగినంత ఆదాయం పొందలేకపోతున్నారని, అందుకే మహిళల కోసం ప్రత్యేక క్యాప్టివ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయడంవల్ల అమ్మకాలు సులభంగా జరిపేందుకు అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 'జన్ ధన్ యోజన' పథకం అంతర్జాతీయ వేదికపై అత్యంత గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు. విద్యా సంస్థలు, మరమగ్గాలు, చిన్నతరహా పరిశ్రమల నుంచి వచ్చిన ప్రతినిధులతో సుష్మా మాట్టాడారు. ఎన్డీయే ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొందని, ఉక్రెయిన్, ఇరాక్, లిబియా, యెమెన్ వంటి దేశాలనుంచి భారతీయులను తమ ప్రభుత్వం తరలించిందని సుష్మా చెప్పారు. యెమన్ నుంచి భారతీయులను రప్పించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అందుకు 28 దేశాలను అభ్యర్థించామని తెలిపారు. ఒకప్పుడు మోదీకి వీసా ఇవ్వడానికి అభ్యంతరం చెప్పిన అమెరికాలో.. ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతులు చాచి ఆయనను ఆహ్వానించడం ఎంతో విశేషమని చెప్పారు.