మనుషులకు ఏం తీసిపోం అన్నట్లుగా పకులు కూడా బిహేవ్ చేస్తున్నాయి. ఔను అవి కూడా మనుషుల మాదిరి విడాకులు తీసుకుంటున్నాయట. అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని పరిశోధకులు అంటున్నారు. అవి విడాకులు తీసుకునేందుకు దారితీసిన పరిస్థితులను చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
అసలేం జరిగిందంటే..మనుషుల్లాగే పక్షలు కూడా తమ భాగస్వాములకు విడాకులు ఇస్తున్నట్లు పరిశోధకులు వివిధ జాతి పక్షులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందట. ఈ మేరకు చైనా, జర్మనీకి చెందిన పరిశోధకులు దాదాపు 232 పక్షి జాతులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 90 శాతం కంటే ఎక్కువ పక్షి జాతులు సాధారణంగా ఒకే సహచరుడితో సంతానోత్పత్తి కాలం వరకు ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఐతే కొన్ని పక్షలు మాత్రం తమ సహచరుడు జీవించి ఉన్నప్పటికీ తదుపరి సంతానోత్పత్తి సీజన్లలో కొత్త భాగస్వామిని వెతుకుంటున్నాయని చెబుతున్నారు.
ఈ ప్రవర్తనను 'విడాకులుగా' సూచించారు పరిశోధకులు. దీనికి ప్రధాన కారణం 'వలసలు' అని అన్నారు. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ పరిశోధకుడు డాక్టర్ జిటాన్ సాంగ్ మాట్లాడుతూ..సంతానోత్పత్తి కాలంలో పుట్టిన పక్షలు బాధ్యతలను మగపక్షులు చూడటంతో.. ఆడపక్షులు తదుపరి సంతానం కోసం వేరేవాటితో జత కట్టేందుకు వెళ్లిపోతున్నట్లు తెలిపారు. అలాగే సుదీర్ఘ దూరాలకు వలస వెళ్లినప్పుడూ తమ పాత భాగస్వామి కోసం వేచి ఉండకుండా కొత్త భాగస్వామితో జత కట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు గమనించారు.
ఎక్కువ వలసలు వెళ్తున్న పక్షల జాతుల్లోనే ఈ విడాకుల రేటు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. పునరుత్పత్తి లేదా వలసల కారణంగా అవి విడిపోతున్నాయని, కొత్త భాగస్వాములను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొన్ని పక్షులు మాత్రం తమ పాత భాగస్వామితో ఉండటం లేదా అవి లేనట్లయితే ఒంటరిగా ఉండిపోవటం జరుతుందని అన్నారు. దీనంతటికి కారణం మనిషేనని, అందువల్లే అవి మన మాదిరిగా విడిపోతున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. తన స్వార్థ కోసం అభివృద్ధి పేరుతో చెట్లు నరకడం, వాటికి ఆవాసం లేకుండా చేయడం తదితర కారణాల రీత్యా అవి వలస బాటపట్టడంతో..పక్షలుకు కూడా ఆ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు.
(చదవండి: తెలుసా! గోళ్ల ఆకారాన్ని బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment