
రోడ్డు ప్రమాదంలో జనగామ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి మృతి
వరంగల్: వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ అసెంబ్లీ నియోజకవర్గ స్వంతంత్ర అభ్యర్థి శశిధర్ రావుతో పాటు ముగ్గురు మరణించారు. మంగళవారం ఉదయం చినపెండ్యాల వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నుజ్జువగా, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో శశిధర్ రావుతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు.