నా జోలికొస్తే అంతే.. | Dalit Welfare Department of the controversial Warden | Sakshi
Sakshi News home page

నా జోలికొస్తే అంతే..

Published Sun, Jan 4 2015 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

నా జోలికొస్తే అంతే..

నా జోలికొస్తే అంతే..

జనగామ డివిజన్‌లో 2005లో ఆ వార్డెన్ విధుల్లో చేరినప్పటి పని తీరు బాగా లేకపోవడం.. వివాదాస్పదంగా వ్యవహరించడంతో పరకాల ప్రాంతానికి బదిలీ అయ్యారు.

దళిత సంక్షేమ శాఖలో వివాదాస్పద వార్డెన్
 
విజిలెన్స్ విచారణలో రూ.3 లక్షల అవినీతి  
ఎస్‌ఎంఎస్, ఫోన్‌లలో బెదిరింపులు  
ఎనిమిదేళ్ల సర్వీసులో మూడు సస్పెన్షన్లు  
తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులకు వేధింపులు  
పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు  

 
హన్మకొండ : జనగామ డివిజన్‌లో 2005లో ఆ వార్డెన్ విధుల్లో చేరినప్పటి పని తీరు బాగా లేకపోవడం.. వివాదాస్పదంగా వ్యవహరించడంతో పరకాల ప్రాంతానికి బదిలీ అయ్యారు. తన హాస్టల్‌లో విద్యార్థులు పదుల సంఖ్యలో ఉంటే రిజిస్టర్‌లో వందల సంఖ్యలో చూపించి నిధులు డ్రా చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి రూ.3 లక్షలు అవినీతి జరిగినట్లు తేల్చారు. ప్రాథమిక చర్యల్లో భాగం గా ఈ వార్డెన్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ములుగు డివిజన్‌లో పోస్టింగ్ ఇవ్వగా.. ఇక్కడా విద్యార్థుల సంఖ్య అధికంగా చూపడంతో మరోసారి సస్పెండయ్యారు. ఆ తర్వాత జనగామ డివిజన్‌లో విధుల్లో చేరారు. ఈసారి తన వద్ద పని చేసే కింది స్థాయి ఉద్యోగులను వేతనాలు ఇవ్వకుండా వేధిం పులకు గురి చేయడంతో.. విసిగిపోయిన ఉద్యోగులు చివరకు అధికారులకు ఫిర్యాదు చేసి పంచాయతీ పెట్టారు.

అడ్డుచెబితే అంతే సంగతులు

జనగామ డివిజన్‌లో విధుల్లో చేరిన తరువాత అవినీతి వ్యవహారం ఎప్పటిలాగే మొదలైంది. అడ్డుకున్న పర్యవేక్షకుల కు ఈ వార్డెన్ తన ప్రతాపం చూపెట్టడంతో.. జనగామ పర్యవేక్షకుడు నెలరోజులకు పైగా సెలవులో వెళ్లారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జీగా వచ్చిన అధికారికి ఇదేతీరుగా చేదు అనుభవం ఎదురైంది. మరో సందర్భంలో హాస్టల్ పర్యవేక్షణకు వచ్చిన ఓ అధికారి.. ఈ వార్డెన్ అక్రమాలు గుర్తించి సరుకులు సీజ్ చేసి తాళం వేశాడు. దీంతో శివాలెత్తిన వివాదాస్పద వార్డె న్ సదరు పర్యవేక్షకుడిని నానా మాటలు అనడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తున్నావంటూ పర్యవేక్షకుని ఇంటికెళ్లి కుటుంబ సభ్యుల ఎదుట నానాయాగి చేసింది. సదరు వార్డెన్ అక్రమా లు తారాస్థాయికి చేరడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డ్రాయింగ్ పవర్ వార్డెన్‌కు తొలగించి పర్యవేక్షకుడిని ఇచ్చారు. ఇక అప్పటి నుం చి జిల్లా అధికారికి, పర్యవేక్షకుడికి ఆ మహిళా వార్డెన్ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. నిత్యం తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఎస్‌ఎంఎస్‌లు పంపడం నిత్యకృత్యంగా మారింది.

ఠాణాలో ఫిర్యాదు

దళిత సంక్షేమశాఖలో ఈ లేడీ డాన్ బాధితులు పెరగడంతో ఉద్యోగులు అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల సుబేదారి ఎస్సై స్వయంగా కలెక్టరేట్‌లోని శాఖ కార్యాలయానికి వచ్చి విచారణ చేశారు. సదరు వార్డెన్ వేధింపులు భరించలేక పోతున్నామంటూ ఉద్యోగులు, అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.
 
 దళిత సంక్షేమ శాఖలో ఆ వార్డెన్ అంటే సాటి వార్డెన్లకు, ఉన్నతాధికారులకు హడల్. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్  (వార్డెన్) హెచ్చరికలు వింటే బేజారు కావాల్సిందే. తన ఎనిమిదేళ్ల కెరీర్‌లో నాలుగు బదిలీలు.. మూడు సస్పెన్షన్లు ఉన్నా ఖాతరు లేదు. కిందిస్థారుు ఉద్యోగుల నుంచి జిల్లాస్థారుు అధికారుల వరకు అందరినీ టార్గెట్ చేసి వేధింపులు, బెదిరింపులకు గురి చేస్తోంది. ఈ వార్డెన్‌పై కలెక్టర్‌తోపాటు  ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌కూ ఫిర్యాదులు అందాయి.   
- సాక్షి, హన్మకొండ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement