
కంచికచర్ల(కృష్ణా జిల్లా): వైఎస్సార్ సీపీ నాయకుల ఫ్లెక్సీను చింపేసిన సంఘటన సోమవారం గొట్టుముక్కల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ సర్పంచ్ గుదే రంగారావు, ఎంపీటీసీ సభ్యురాలు గుదే సరస్వతి వైఎస్సార్ సీపీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని ఆకతాయిలు రాత్రి వేళ ఫ్లెక్సీని చింపివేశారు.
చదవండి: AP: బండారుపై తిరగబడ్డ జనం.. వెళ్లవయ్యా.. వెళ్లు!
2014లో గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు ఆలోకం కృష్ణారావును చిన్నపాటి వివాదానికి టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. గతంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావుపై టీడీపీ నాయకులు హత్య ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీని టీడీపీ నాయకులే ధ్వంసం చేసి ఉంటారని వైఎస్సార్ సీపీ నాయకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment