రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి పాక్షికంగా ధ్వంసం చేశారు.
రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి పాక్షికంగా ధ్వంసం చేశారు. చేయితోపాటు నడుం కింది భాగం ధ్వంసం అయింది. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. విగ్రహానికి నష్టం కలిగించిన వారిని పట్టుకుని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ ఖలీల్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఇందుకు కారకులైన వారిని రెండు రోజులలో దుండగులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.