
గోరంట్ల: పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎంను గురువారం రాత్రి గుర్తు తెలియని ఓ దుండగుడు ధ్వంసం చేసి చోరీకి యత్నంచాడు. ఇది విఫలం కావడంతో పక్కనే ఉన్న కృష్ణారెడ్డి కిరాణా షాపు తాళం పగులగొట్టి రూ. 14 వేల నగదు దొచుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. శుక్రవారం ఉదయం ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ తన సిబ్బంది వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్‌బీఐ బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్‌ను నిశితంగా పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment