భారీగా బెల్లం ఊట ధ్వంసం | Jaggery secretion destroyed in ysr district | Sakshi
Sakshi News home page

భారీగా బెల్లం ఊట ధ్వంసం

Published Wed, Dec 23 2015 8:25 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

భారీగా బెల్లం ఊట ధ్వంసం

భారీగా బెల్లం ఊట ధ్వంసం

సుండుపల్లి: వైఎస్సార్ జిల్లాలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో బుధవారం భారీగా దాడులు నిర్వహించారు. కొలిమిట్ట, మాతమ్మ హరిజనవాడ అటవీప్రాంతంలోలో అక్రమంగా నిల్వ ఉంచిన  2200 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసంచేశారు. అదేవిధంగా 60లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

ఉప్పరపల్లిలో నాగేనాయక్ అనే వ్యక్తి ఇంట్లో నాటుసారా ఉన్నట్లు సమాచారం రావడంతో అతని నుంచి 20లీటర్ల నాటుసారాను స్వాధీనపరుచుకున్నారు. సుమారు 20 డ్రమ్ముల్లో ఊటను పారబోశారు. ఈ దాడుల్లో కడప ఎక్సైజ్ అధికారిణి విజయకుమారి, డీటీఎఫ్‌టీఐ వెంకటరమణ, రాయచోటి ఎక్సైజ్‌శాఖ సీఐ కిషోర్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement