టోల్ బూత్‌పై దాడి
Published Thu, Aug 22 2013 11:46 PM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM
నాసిక్: టోల్ చెల్లించమని అడిగారనే కోపంతో శివసేన ఎమ్మెల్యే అనిల్ కదమ్, ఆయన అనుచరులు టోల్‌నాకాను ధ్వంసం చేశారు. ఈ ఘటన నాసిక్ జిల్లా ముంబై-ఆగ్రా జాతీయరహదారిలోని పింపల్గావ్-బస్వంత్ టోల్‌బూత్ వద్ద గురువారం చోటుచేసుకుంది. టోల్ చెల్లించమని అడిగినందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బందిని అనిల్ దూషిస్తున్న దృశాల్యను ఓ ప్రైవేటు టీవీ చానల్ ప్రసారం చేసింది. ఎమ్మెల్యేలకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉందని, అయితే విధుల్లో ఉన్న సిబ్బంది అడిగారని, దీంతో అనిల్ తనను తాను నియంత్రించుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అనిల్ ఓ ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైందా లేదా అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు. ఎమ్మెల్యే అనిల్ కదమ్... నిఫడ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Advertisement
Advertisement