అనధికార ఆక్వా చెరువులు ధ్వంసం
అనధికార ఆక్వా చెరువులు ధ్వంసం
Published Sun, Feb 19 2017 12:01 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
హైకోర్టు ఉత్తర్వులను అమల్లోకి తెచ్చిన అధికారులు
రెవెన్యూ, ఫిషరీష్, పోలీసు అధికారుల జాయింట్ యాక్షన్
అమలాపురం రూరల్ : హైకోర్టు ఉత్తర్వులను అధికారులు తక్షణమే అమల్లోకి తెచ్చి అనధికార ఆక్వా చెరువులను శనివారం ధ్వంసం చేశారు. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో దాదాపు 50 ఎకరాల్లో అనధికారికంగా ఆక్వా సాగు చేస్తున్న వైనంపై స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించి చెరువుల సాగును నిలిపివేయాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్థానిక రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు విచారణ చేసి నివేదిక పంపించారు. అయినా సాగు ఆగకపోవటంతో బాధితులు కోర్టు ధిక్కార నేరం కింద మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్వయంగా కలెక్టర్‌ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడంతో అధికారులు ఇప్పుడు చెరువుల ధ్వంసానికి తక్షణ చర్యలు చేపట్టారు. జేసీబీలతో చెరువులు ధ్వంసం చేయించారు. రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖ అధికారులు సంయుక్తంగా ఆ యాక్ష¯ŒS చేపట్టారు. తహసీల్దార్ నక్కా చిట్టిబాబు, మత్స్యశాఖ డీడీ ఎస్.అంజలి, ఏడీఏ ఎస్.సంజీవరావు, ఎఫ్‌డీవో సీహెచ్.గోపాల కృష్ణ, ఆర్‌ఐ కేశవదాసు రాంబాబు, ఎస్సై ఎం.గజేంద్రకుమార్‌ల స్వీయ పర్యవేక్షణలో చెరువులకు జేసీబీలతో గండ్లు కొట్టి ధ్వంసం చేశారు. రైతులు జంపన శ్రీలక్ష్మి, జంపన సత్యనారాయణరాజు, పులవర్తి సుబ్బారావు, నడింపల్లి పార్వతమ్మ, రాజులపూడి సత్యనారాయణ, నడింపల్లి సుబ్బరాజులకు చెందిన 50 ఎకరాల్లోని అక్రమ ఆక్వా సాగును ధ్వంసం చేస్తున్నారు.
Advertisement