unofficial
-
సైబర్ మోసాలపై వెంటనే ఫిర్యాదు...లేదంటే! ఎస్బీఐ కీలక హెచ్చరిక
సాక్షి, ముంబై: దేశంలో ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్, డిజిటల్ మోసాల కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక సూచనలు జారీ చేసింది. డిజిటల్ చెల్లింపు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో అనధికారిక లావాదేలపై తక్షణమే ఫిర్యాదు చేయాలని కస్టమర్లను అప్రమత్తం చేసింది. తద్వారా ఇంటర్నెట్ వినియోగదారులు ఫిషింగ్, ర్యాన్సమ్ దాడుల నుండి, సైబర్ కేటుగాళ్ల మోసాలనుంచి సురక్షితంగా ఉండవచ్చని పేర్కొది. ఎస్బీఐ ఖాతాకు సంబంధించి ఏదైనా ఆర్థిక మోసం జరిగినట్లయితే, ఖాతాదారుడు ఫిర్యాదు చేయాలని తెలిపింది. పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు తమ ఖాతాల్లో ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలని తెలిపింది. అలా కాకుండా ఫిర్యాదుకు ఎక్కువ సమయం తీసుకుంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. అనధికార లావాదేవీని గమనించిన వెంటనే తమ టోల్-ఫ్రీ నంబర్ 18001-2-3-4కు తెలియజేయాలని వెల్లడించింది. తద్వారా సకాలంలో సరైన చర్యలు తీసుకొనే అవకాశం తమకు ఉంటుందని, లేదంటే భారీ మూల్యం తప్పదని పేర్కొంది. 1800 1234 లేదా 1800 2100లో తమ కాంటాక్ట్ సెంటర్ టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసిఎస్బీఐ బ్యాంకింగ్ అవసరాలను తీసు కోవచ్చంటూ ట్వీట్ చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో సైబర్ నేరగాళ్ల ఎత్తులనుంచి, సైబర్ దాడులనుంచి కస్టమర్లు తమని తాము రక్షించు కోవడం చాలా ముఖ్యమని పేర్కొంది. టోల్-ఫ్రీ నంబర్‌ను డయల్ చేయడంతో పాటు, కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ , భీమ్ ఎస్బీఐ పే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను బ్యాంక్ వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత మోసపూరిత ఛానెల్‌ను బ్లాక్ చేస్తామని ఎస్బీఐ వెల్లడించింది. రిజిస్టర్డ్ ఫిర్యాదు నంబర్, ఇతర వివరాలను కస్టమర్‌కు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామనీ, అలా వచ్చిన ఫిర్యాదును 90 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపింది. Fulfill your banking needs, just call! Call SBI Contact Centre toll-free at 1800 1234 or 1800 2100.#SBI #SBIContactCentre #TollFree #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/RtrXf042KO — State Bank of India (@TheOfficialSBI) October 25, 2022 -
అది ‘పెగసస్’గా నిర్ధారించలేం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసస్‌ను కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా ఉపయోగిస్తోందంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ ప్యానెల్ తన నివేదికను ధర్మాసనానికి అందజేసింది. 29 ఫోన్లను పరీక్షించగా, కేవలం 5 ఫోన్లలో ఒకరకం మాల్వేర్ను గుర్తించినట్లు నివేదికలో వెల్లడించింది. అయితే, అది నిజంగా ఇజ్రాయెల్ పెగసస్ స్పైవేర్ అవునో కాదో నిర్ధారణకు రాలేకపోతున్నట్లు పేర్కొంది. పెగసస్ అంశంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలోని ప్యానెల్ తన నివేదికను తాజాగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి అందజేసింది. అందులోని వివరాలను ధర్మాసనం గురువారం బయటపెట్టింది. ‘‘దర్యాప్తునకు కేంద్రం సహకరించలేదని కమిటీ(ప్యానెల్) చెప్పింది. పెగసస్ విషయంలో కోర్టులో విచారణకు మీరు(కేంద్రం) సహకరించలేదు. కమిటీకి సహకరించలేదు’ అని పేర్కొంది. పౌరుల గోప్యత హక్కు రక్షణ, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఇప్పుడున్న చట్టాలను సవరించాలని సూచించిందని వివరించింది. నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం పరీక్ష కోసం టెక్నికల్ కమిటీకి 29 ఫోన్లు అందజేయగా, అందులో 5 ఫోన్లలో మాల్వేర్ కనిపించడం కొంత ఆందోళనకరమైన విషయమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 29 ఫోన్లు ఇచ్చిన వారికి ఈ నివేదికను అందజేయలేదని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, చట్టవిరుద్ధమైన నిఘా, పౌరుల గోప్యత విషయంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్యానల్ ప్రతిపాదించిందని చెప్పారు. నివేదికను విడుదల చేయొద్దంటూ ప్యానల్ తమను కోరిందన్నారు. ఇవన్నీ సాంకేతికపరమైన అంశాలని, నివేదికలో ఏయే భాగాలను బహిర్గతం చేయాలో తాము నిర్ణయిస్తామని, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని వివరించారు. ప్యానెల్ నివేదికను కక్షిదారులకు అందజేయాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాకేశ్ త్రివేది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. దర్యాప్తునకు కేంద్రం సహరించలేదని ధర్మాసనం చెప్పగా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ఆ విషయం తనకు తెలియదని బదులిచ్చారు. ధర్మాసనం తదుపరి విచారణకు నాలుగు వారాలకు వాయిదా వేసింది. రాహుల్ క్షమాపణ చెబుతారా?: బీజేపీ పెగసస్ వ్యవహారంలో ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు దుష్ప్రచారం సాగించాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ ఇకనైనా క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, స్వయం ప్రకటిత మేధావులు, కొన్ని ప్రభుత్వేతర సంస్థలు, ఓ వర్గం మీడియా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేశాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ అబద్ధాలు ప్రచారం చేసినట్లు తేటతెల్లమయ్యిందన్నారు. కేంద్రం ఏదో దాస్తోంది: రాహుల్ పెగసస్ ఉదంతంలో కేంద్ర ప్రభుత్వంతో ఏదో దాచేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌కు మోదీ ప్రభుత్వం సహకరించలేదని తప్పుపట్టారు. దీన్నిబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తెలిసిపోతోందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని మోదీ సర్కారు కోరుకుంటోందన్నారు. దర్యాప్తునకు సహకరించలేదంటే ఏదో నిజాన్ని దాస్తున్నట్లు అంగీకరించినట్లేనని చెప్పారు. ఈ మేరకు రాహుల్ గురువారం ట్వీట్ చేశారు. -
బిల్ గేట్స్‌ను అరెస్ట్ చేయాల్సిందే.. మరీ ఇంత దారుణం చేశాడా?
న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అరెస్ట్ చేయాలంటూ ట్విటర్లో ఓ పోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. భారత్‌లో అమాయక గిరిజన బాలికలపై వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను తన సంస్థ ( బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్) తరపున అనధికారికంగా నిర్వహించారని , వాటికి పెద్ద ఎత్తున నిధులను కూడా సమకూర్చారంటూ గ్రేట్‌గేమ్ ఇండియా ఒక ప్రత్యేక కథనం విడుదల చేసింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తరువాత నుంచి 'అరెస్ట్ బిల్ గేట్స్' అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్విటర్లో నెటిజన్ల పోస్ట్ చేయగా, ప్రస్తుతం అది ట్రెండింగ్‌లో ఉంది. మెలిండా గేట్స్‌తో విడాకుల వ్యవహారం, మైక్రోసాఫ్ట్‌లోని ఒక మహిళా ఉద్యోగితో అతని అక్రమ సంబంధంపై వివాదంతో పాటు ప్రస్తుతం తాజా ఆరోపణలు చూస్తుంటే బిల్ గేట్స్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. గ్రేట్‌గేమ్ ఇండియా రాసిన ప్రత్యేక కథనంలో.. 2009లో తెలంగాణ సహా నాగాలాండ్‌లోని గిరిజన బాలికలపైనా అనాధికారంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టినట్లు ఆ సంస్థ పేర్కొంది. 14 వేల మంది కోయ గిరిజన తెగకు చెందిన 10 నుంచి 14 సంవత్సరాల్లోపు బాలికపై ఈ ప్రయోగాలు సాగాయని తన కథనంలో పొందుపరిచింది. అత్యంత వివాదాస్పదమైన గర్డాసిల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఆ బాలికలపై జరిపినట్లు తెలిపింది. ఆ వ్యాక్సిన్ హ్యూమన్పాపిలోమా వైరస్‌ను నివారించడానికి తయారు చేసింది. అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా దాదాపు అన్ని దేశాల్లోనూ విస్తరించి ఉన్న ఎన్జీఓ సంస్థ ప్రోగ్రామ్ ఫర్ అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ (పాత్) ద్వారా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించినట్లు గ్రేట్‌గేమ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం ఇంటికి దూరంగా వసతి గృహాల్లో నివసించే బాలికలను, పేదరికంలో ఉన్న వారినే ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగాలు వికటించడం వల్ల పలువురు గిరిజన బాలికలు దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యారని, కొందరు మరణించారని వివరించింది. తమ కుమార్తెకు గర్డాసిల్ అనే వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేశారనే విషయం.. ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా తెలియదని అంటున్నారు. ఇదే పరిస్థితి ఖమ్మం జిల్లా పలువురు గిరిజనుల్లో నెలకొని ఉందని పేర్కొంది. నాగాలాండ్‌లోని కొన్ని గిరిజన కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేసింది. ఇటీవల వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వకూడదంటూ గేట్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. This is the untold story of how @BillGates funded NGO PATH killed tribal girls in India in unauthorised clinical trials and got away with it. #ArrestBillGates https://t.co/yYqCRZ4Ah3 — Tribal Army (@TribalArmy) May 29, 2021 He is a monster and enemy of humanity...He must be stopped for good.#ArrestBillGates #ArrestBillGates#ArrestBillGates pic.twitter.com/sXyaTxV9is — Suraj Samrat 💙 (@samratsurajINC) May 29, 2021 చదవండి: వీళ్లు కరోనా ఉన్నట్లు మరిచారేమో.. అందుకే ఇలా? -
అక్షర్ అదరగొట్టినా.. తప్పని ఓటమి
అంటిగ్వా: ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(81నాటౌట్; 63 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సర్) ఒంటరి పోరాటంతో అదరగొట్టిన టీమిండియా-ఏకు ఓటమి తప్పలేదు. వెస్టిండీస్-ఏతో జరుగుతున్న అనధికారిక ఐదు వన్డేల సిరీస్‌లో భారత జట్లు తొలి ఓటమి నమోదు చేసింది. ఇప్పటికే మూడు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నాలుగో వన్డేలో ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విండీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులకే పరిమితమైంది. భారత ఆటగాళ్లలో అక్షర్ పటేల్ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. కృనాల్ పాండ్యా(45) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో కీమో పాల్, పావెల్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(84; 100 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు), థామస్(70; 95 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లు), కార్టర్(50; 43 బంతుల్లో 8ఫోర్లు) అర్దసెంచరీలతో రాణించడంతో టీమిండియా ముందు విండీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లతో రాణించగా.. అవేష్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఆదివారం జరగనుంది. -
రుతురాజ్ 187 నాటౌట్
బెల్గామ్: ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (136 బంతుల్లో 187 నాటౌట్; 26 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన కెరీర్లోనే గొప్ప ఇన్నింగ్స్ ఆడటంతో... శ్రీలంక ‘ఎ’తో గురువారం జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 48 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ నాలుగు వికెట్లకు 317 పరుగులు చేసింది. రుతురాజ్ రెండో వికెట్‌కు అన్మోల్ప్రీత్ సింగ్ (67 బంతుల్లో 65; 6 ఫోర్లు)తో కలిసి 163 పరుగులు... మూడో వికెట్‌కు ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, సిక్స్)తో కలిసి 99 పరుగులు జోడించాడు. అనంతరం 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ 42 ఓవర్లలో ఆరు వికెట్లకు 269 పరుగులు చేసి ఓడిపోయింది. షెహాన్ జయసూర్య (120 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. భారత ‘ఎ’ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికపై శనివారం జరుగుతుంది. -
అనధికారులకు అగ్రతాంబూలం!
- మంత్రుల సమీక్షలో ప్రొటోకాల్‌కు పాతర – చైర్‌పర్సన్‌కు అందని ఆహ్వానం – టీడీపీ అభ్యర్థికి, కార్యకర్తలకు అగ్రస్థానం నంద్యాల : అధికారికంగా మంత్రులు నిర్వహించిన సమీక్షలో అనధికారులకు అగ్రతాంబూలమిచ్చి ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి పార్టీ సమావేశంగా మార్చేశారు అధికారపార్టీ నేతలు. ఆదివారం స్థానిక సూరజ్‌గ్రాండ్ హోటల్లో మంత్రులు నారాయణ,అఖిలప్రియ అధికారులు,డ్వాక్రా మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందుకు మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచనకు పిలుపులేదు. కానీ ఎటువంటి హోదా లేని భూమా బ్రహ్మానంద రెడ్డికి అధిక ప్రాధాన్యతనిచ్చి తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు. అలాగే కార్యకర్తలను ముందువరసలో కూర్చోబెట్టి డ్వాక్రా మహిళలు, అధికారులకు వెనుక వరుసలో సీట్లు కేటాయించారు. సీఎం 21వ తేదీన నంద్యాలలో పర్యటించనుండటం, నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి పేరు ఖరారు చేయడంతో మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ఆదివారం తెల్లవారుజామునే అభివృద్ధి పనులను,సమస్యలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్,రోడ్డు భవనాల శాఖ, మున్సిపల్ ఉపాధ్యాయుల సంఘాలు, డ్వాక్రా మహిళలతో సమావేశం చేపట్టారు. ప్రోటోకాల్‌ను విస్మరించిన అధికారులు : మంత్రుల సమీక్షలో అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించారు. దేశం సులోచన పార్టీ మారడంతో ఆమెను పక్కన పెట్టారు. ఆమె వర్గానికి చెందిన కౌన్సిలర్లకు కూడా సమాచారాన్ని పంపలేదు. సమావేశంలో పార్టీ నాయకులే ముందు వరుసలో కూర్చోవడంతో అధికారులు, డ్వాక్రా మహిళలకు చోటులేకపోవడంతో వెనుక వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. -
‘తమ్మిలేరు’ తగాదా
చింతలపూడి : తమ్మిలేరు రిజర్వాయర్‌లో కొన్నేళ్లుగా అనధికారికంగా రొయ్య ల సాగు చేస్తుండటం వివాదాలకు తావిస్తోంది. ప్రాజెక్టుపై రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరగడంతో దళారులు మత్స్యకారుల నోళ్లు మూ యిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మ త్స్యకారుల సంఘాల మధ్య వివా దం చోటు చేసుకుంటోంది. నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు ప్రాజెక్టు, కృష్ణాజిల్లా మంకొల్లు వద్ద నిర్మించిన గోనెలవాగులో గతేడాది సెప్టెంబర్‌లో అనధికారికంగా రొయ్య పిల్లలను వేశా రు. ఇప్పుడు వాటిని పట్టి అమ్ముకునే విషయంలో మరోసారి వివాదం తలెత్తింది. ప్రాజెక్టులో రొయ్య పిల్లలను మేము వేశామంటే, మేము వేశామని రొయ్యలు మాకే అమ్మాలని రెండు జిల్లాలకు చెందిన వ్యాపారులు వివా దాన్ని రగిల్చారు. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రొయ్యల వేటను నిషేధిస్తూ కృష్ణాజిల్లా చాట్రాయి తహసీల్దార్ 144 సెక్షన్ విధించారు. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడి బతుకుతున్న సుమారు 400 మత్స్యకార కుటుంబా లు ఆందోళన చెందుతున్నాయి. దళారుల కన్ను మత్స్యశాఖ ఏటా తమ్మిలేరులో చేప పిల్లలను వేసి, అవి పెరిగాక వాటిని మత్స్యకారులు పట్టుకుని అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. అయితే రొయ్య ల సాగు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుండటంతో రెండు జిల్లాలకు చెందిన దళారుల కన్ను ప్రాజెక్టుపై పడింది. రాజకీయ పలుకుబడితో జలాశయంలో రొయ్యలు పెంచుతూ కోట్లు గడిస్తున్నారు. ఇందుకోసం మ త్స్యకార సంఘాలతో ముందుగానే ఒప్పందం చేసుకుని పట్టిన రొయ్యలను తమకే విక్రయించాలని నిబంధన విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పట్టిన రొయ్యలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారి ప్రయత్నించగా మత్స్యకారులు గిట్టదని చెప్పడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానిక మత్స్యకారులు విషయాన్ని మంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో జిల్లాకు చెందిన మత్స్యశాఖ డీడీ ఎం.యాకూబ్‌పాష, తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్ గ త శనివారం ప్రాజెక్టును పరిశీలించా రు. మత్స్యకార సంఘాలతో సంప్రదిం పులు జరిపారు. త్వరలోనే రెండు జి ల్లాల అధికారులు, మత్స్యకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు రొయ్యల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. రొయ్యల సాగు నిషేధం తమ్మిలేరు ప్రాజెక్టులో రొయ్యల సాగు నిషేధం. అయినా దళారులు ఏటా రొయ్య పిల్లలను జలాశయంలో వేసి పెంచడం, పట్టుకుని అమ్మడం చేస్తున్నారు. ఇదంతా ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తమ్మిలేరు ప్రాజెక్టుపై రూ.10 కోట్లతో తాగునీటి పథకం నిర్మిస్తోంది. దీని ద్వారా చింతలపూడి, ప్రగడవరం పంచాయతీలకు తాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టులో రొయ్యల సాగు చేపడితే నీరు కలుషితమై తాగడానికి పనికిరావని, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావును వివరణ కోరగా తమ్మిలేరులో రొయ్యల సాగు చేస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నామని, విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అనధికార ఆక్వా చెరువులు ధ్వంసం
హైకోర్టు ఉత్తర్వులను అమల్లోకి తెచ్చిన అధికారులు రెవెన్యూ, ఫిషరీష్, పోలీసు అధికారుల జాయింట్ యాక్షన్ అమలాపురం రూరల్ : హైకోర్టు ఉత్తర్వులను అధికారులు తక్షణమే అమల్లోకి తెచ్చి అనధికార ఆక్వా చెరువులను శనివారం ధ్వంసం చేశారు. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో దాదాపు 50 ఎకరాల్లో అనధికారికంగా ఆక్వా సాగు చేస్తున్న వైనంపై స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించి చెరువుల సాగును నిలిపివేయాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్థానిక రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు విచారణ చేసి నివేదిక పంపించారు. అయినా సాగు ఆగకపోవటంతో బాధితులు కోర్టు ధిక్కార నేరం కింద మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్వయంగా కలెక్టర్‌ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడంతో అధికారులు ఇప్పుడు చెరువుల ధ్వంసానికి తక్షణ చర్యలు చేపట్టారు. జేసీబీలతో చెరువులు ధ్వంసం చేయించారు. రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖ అధికారులు సంయుక్తంగా ఆ యాక్ష¯ŒS చేపట్టారు. తహసీల్దార్ నక్కా చిట్టిబాబు, మత్స్యశాఖ డీడీ ఎస్.అంజలి, ఏడీఏ ఎస్.సంజీవరావు, ఎఫ్‌డీవో సీహెచ్.గోపాల కృష్ణ, ఆర్ఐ కేశవదాసు రాంబాబు, ఎస్సై ఎం.గజేంద్రకుమార్‌ల స్వీయ పర్యవేక్షణలో చెరువులకు జేసీబీలతో గండ్లు కొట్టి ధ్వంసం చేశారు. రైతులు జంపన శ్రీలక్ష్మి, జంపన సత్యనారాయణరాజు, పులవర్తి సుబ్బారావు, నడింపల్లి పార్వతమ్మ, రాజులపూడి సత్యనారాయణ, నడింపల్లి సుబ్బరాజులకు చెందిన 50 ఎకరాల్లోని అక్రమ ఆక్వా సాగును ధ్వంసం చేస్తున్నారు.