- వీహెచ్‌పీ, బీజేపీ నాయకుల ఆందోళన
- పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
జగిత్యాల అర్బన్ : జగిత్యాల పట్టణం మంచినీళ్ల బావి సమీపంలోని మడలేశ్వరస్వామి ఆలయం ఆవరణలోని రావిచెట్టు కింద ఉన్న నాగదేవతల విగ్రహాలను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు వీహెచ్‌పీ, బీజేపీ నాయకులతో కలిసి నిజమాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఓ పథకం ప్రకారమే దుండగులు విగ్రహాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. స్థానిక ఎస్సై శివకృష్ణ అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేవరకు ఇక్కడి నుంచి కదలమని భీష్మించారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ కరుణాకర్‌రావుకు ఫిర్యాదు చేశారు.మంచినీళ్ల బావి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.