రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నిరవధికంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ దాడుల్లో దక్షిణ ఉక్రెయిన్లోని కాఖోవ్కా హైడ్రో ఎలెక్ట్రిక్ డ్యామ్ తునాతునకలైంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ డ్యామ్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారీ నష్టం...
దక్షిణ ఉక్రెయిన్ లోని డెనిప్రో నదిపై నిర్మించబడిన ఈ కాఖోవ్కా డ్యామ్ ప్రధానంగా క్రైమే పెనిన్సులా, న్యూక్లియర్ ప్లాంట్ కు నీటిని సరఫరా చేస్తుంటుంది. ఈ ఒక్క డ్యామ్ కూలిన కారణంగా కిందన ఉన్న అనేక పట్టణాల్లో వరద ప్రమాదం పొంచి ఉంది. ఆయా లోతట్టు నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాల్సిందిగా ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. డ్యామ్ కూల్చివేతపై రష్యా బలగాలు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యాపైనే ఆరోపణలు చేస్తోంది.
BREAKING: Video shows the Kakhovka hydro-electric dam in southern Ukraine has been destroyed pic.twitter.com/DePGbQUHRD
— BNO News (@BNONews) June 6, 2023
Comments
Please login to add a commentAdd a comment