సాక్షి, హైదరాబాద్ : నగరంలో కొత్త రకం గంజాయి దందా వెలుగుచూసింది. గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి విక్రయిస్తున్న ఓ ముఠాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్విడ్ గంజాయి సరఫరా వ్యాపారం నడుస్తోంది. బిర్యానీ ఫుడ్ కలర్స్ బాటిల్స్‌లో, తేనె బాటిల్స్‌లో గంజాయి లిక్విడ్‌ను నింపి అమ్ముతున్నారు. వైజాగ్ నుంచి లిక్విడ్ గంజాయిని హైదరాబాదుకు తీసుకు వచ్చి, చిన్న చిన్న బాటిళ్లలో నింపి సరఫరా చేస్తున్నారు.
బెంగళూరులోని విద్యార్ధులకు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగులకు గంజాయిని విక్రయిస్తున్నారు. లిక్విడ్ గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment