గంజాయి పట్టివేత | marijuana captured | Sakshi
Sakshi News home page

గంజాయి పట్టివేత

Published Tue, Jul 11 2017 11:19 PM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM

marijuana captured

ఎమ్మిగనూరు రూరల్ : పట్టణ సమీపంలో తుంగభద్ర దిగువ కాల్వ వద్ద మంగళవారం సాయంత్రం 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు. నందవరం మండల హలహర్వికి చెందిన మట్కాబీటర్‌ ఉప్పరి రామాంజనేయులు, పట్టణానికి చెందిన చాకలి గోపాల్‌ కొన్ని రోజులుగా ఆదోని నుంచి గంజాయి తీసుకువచ్చి ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అందులో బాగంగానే మంగళవారం ఆదోని నుంచి గంజాయిని తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో  పోలీసులు తనిఖీలు చేశారున్నారు. చాకలి గోపాల్‌ పారిపోవడంతో ఉప్పరి రామాంజనేయులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు సమక్షంలో గంజాయికి పంచనామా నిర్వహించామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement