llc
-
అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్?
సాక్షి, బళ్లారి అర్బన్: తాలూకాలోని మోకా పోలీస్టేషన్ పరిధిలో సింధవాళ దగ్గర తుంగభద్ర ఎల్ఎల్సీ కాలువలోకి తల్లి ఇద్దరు బిడ్డలతో దూకింది. తల్లి గల్లంతు కాగా ఒక చిన్నారి చనిపోగా, మరో చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. నగరంలోని గుగ్గరహట్టికి చెందిన లక్ష్మి(27)కి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హత్తిబెళగల్ గ్రామానికి చెందిన వెంకటేష్‌తో పెళ్లయింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. రెండురోజుల కిందట భర్తతో గొడవపడి లక్ష్మి తన నలుగురు పిల్లల్లో ఇద్దరిని తీసుకుని గుగ్గరహట్టిలోని పుట్టింటికి వచ్చింది. తమ్ముడు సురేష్ బుజ్జిగించి భర్త ఇంటికి వెళ్లాలని ఆలూరు బస్సు ఎక్కించి పంపించాడు. భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని ఆమె మధ్యలో దిగిపోయి సింధవాళ దగ్గర ఉన్న కాలువలోకి పిల్లలతో కలిసి దూకింది. సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరుగున వచ్చి కాపాడేందుకు యత్నించారు. ఇద్దరు పిల్లలు వారి చేతికి దొరకగా, తల్లి కాలువలో కొట్టుకుపోయింది. అయితే వారిలో శాంతి అనే చిన్నారి మృతి చెందింది. వెన్నెల అనే చిన్నారి బతికినట్లు మోకా ఎస్ఐ పరశురామ్ తెలిపారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?) -
‘జల’ నిర్బంధం
- ఎల్లెల్సీ ప్రవాహానికి అడ్డుకట్ట - మోకావద్ద రింగ్‌బండ్ - కర్ణాటక వాసుల దుశ్చర్య - తెరుచుకోని ఎస్కేప్ చానల్ షట్టర్లు - చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు ఆదోని/హాలహర్వి: తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీకి విడుదల అయిన తాగునీటికి కర్ణాటకలోని మోకా వద్ద అడ్డుకట్ట పడింది. ఇసుక సంచులతో కాలువకు అడ్డంగా దాదాపు ఏడు అడుగుల ఎత్తుతో రింగ్ బండ్ నిర్మించారు. రింగ్ బండ్‌కు ఎగువన ఉన్న వంకకు నీరు మళ్లించుకోడానికే కర్ణాటక వాసులు ఇలా చేశారని తెలుస్తోంది. దీంతో జిల్లాకు నీటి చేరిక మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మూడురోజుల క్రితం విడుదల.. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ నియోజక వర్గాలలో ఎల్లెల్సీ ఆధారంగా 27 ఎస్ఎస్ ట్యాంకులు నిర్మించారు. ఇందులో ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల కోసం నిర్మించినవి కూడా ఉన్నాయి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఎల్లెల్సీపై ఆశలు పెంచుకున్నారు. వర్షాల రాకతో గడిచిన వారం రోజుల్లో తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం 12.8 టీఎంసీలకు చేరింది. నీటి చేరిక ఆశాజనకంగా ఏపీ వాటా కింద ఎల్లెల్సీకి 500 క్యూసెక్కుల నీనరు విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ పెట్టారు. ఇండెంట్ మేరకు మూడు రోజుల క్రితం జలాశయం నుంచి బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. అడ్డంకులు వీ.. ఎల్లెల్సీ ద్వారా నీటి ప్రవాహం బుధవారానికి మోకా వద్దకు చేరింది. మరో రెండు రోజుల్లో రాష్ట్ర సరిహద్దు చింతకుంటకు ఆ తరువాత మూడు, నాలుగు రోజుల్లో కోడుమూరు వరకు నీటి ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేశారు. వెంటనే ఎస్ఎస్ ట్యాంకులకు నీటి పంపింగ్ ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే కర్ణాటకలో నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో తాగు నీటి ఇబ్బందులు తప్పవేమోనని అధికారులు, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో బోర్డు అధికారులు వెంటనే రింగ్‌బండ్‌ను తొలగించాల్సి ఉంది. షెట్టర్లను తెరవని అధికారులు ఏపీ వాటా నీటిని జిల్లాకు చేర్చడంపై తుంగభద్ర బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాగునీటి కోసం విడుదల అయిన నీరు మోకా వద్దకు చేరింది. అయితే ఎస్కేప్ చానల్ వద్ద షట్టర్లను మాత్రం అధికారులు తెరవలేదు. ఎగువన ఇసుక సంచులను తొలగించినా ఎస్కేప్ చానల్ వద్ద నీటి ప్రవాహం మళ్లీ నిలిచిపోతోంది. ఆదోని మండలం హానువాళు 251కిమీ వరకు కాలువ బోర్డు పరిధిలో ఉంది. దీంతో ఆదోని ఎల్లెల్సీ ప్రాజెక్టు అధికారులకు కాలువపై ఎలాంటి అధికారం ఉండదు. అయితే నీటి విడుదల జరిగినా బోర్డు అధికారులు ఎస్కేప్ చానల్ షట్టర్లు తెరవక పోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. చర్యలు చేపట్టండి ఎల్లెల్సీకి అడ్డంగా మోకా వద్ద ఏర్పాటు చేసిన రింగ్ బండ్‌ను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి. జిల్లా కలెక్టరు సత్యనారాయణను కోరారు. మోకా వద్ద ఇసుక బస్తాలతో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారనే సమాచారం రావడంతో వైఎస్సార్ నాయకుటు చంద్రకాంత్‌రెడ్డి హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి ఫోన్లో సమాచారం అందించారు. ఈ విషయమైజిల్లా కలెక్టరు, నీటి పారుదల శాఖ, బోర్డు ఈఈతో తాను మాట్లాడానని ఎమ్మెల్యే ఫొన్లో ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై కలెక్టరు బళ్లారి జిల్లా కలెక్టరును కూడా ఫోన్లో సంప్రదించి పరిస్థితిని వివరించారని చెప్పారు. రింగ్‌బండ్ తొలగింపునకు వెంటనే చర్యలు చేపడుతామని, ఎస్కేప్ చానల్ వద్ద షట్టర్లను కూడా తెరిపిస్తామని బళ్లారి జిల్లా కలెక్టరు తెలిపారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
గంజాయి పట్టివేత
ఎమ్మిగనూరు రూరల్ : పట్టణ సమీపంలో తుంగభద్ర దిగువ కాల్వ వద్ద మంగళవారం సాయంత్రం 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. నందవరం మండల హలహర్వికి చెందిన మట్కాబీటర్ ఉప్పరి రామాంజనేయులు, పట్టణానికి చెందిన చాకలి గోపాల్ కొన్ని రోజులుగా ఆదోని నుంచి గంజాయి తీసుకువచ్చి ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అందులో బాగంగానే మంగళవారం ఆదోని నుంచి గంజాయిని తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేశారున్నారు. చాకలి గోపాల్ పారిపోవడంతో ఉప్పరి రామాంజనేయులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తహశీల్దార్ వెంకటేశ్వర్లు సమక్షంలో గంజాయికి పంచనామా నిర్వహించామన్నారు. -
జలకళ
హొళగుంద: జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయిని అయిన తుంగభద్ర రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతంలోని శివమొగ్గ, ఆగుంబే తదితర ప్రాంతల్లో వర్షాలు పడుతుండడంతో రెండు రోజుల నుంచి డ్యాంలోకి వరద నీరు చేరిక పెరుగుతోంది. ఈ నెల 27 న డ్యాంలో 1338 క్యూసెక్కుల నీరు చేరగా శుక్రవారం నాటికి 14,275 క్యూసెక్కులకు పెరిగింది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే జూలై 15 తర్వాత దిగువ కాలువ (ఎల్లెల్సీ)కి నీటి విడుదల పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. -
నీరు నిండితే ఒట్టు
- ఎల్లెల్సీలో అడుగంటిన ప్రవాహం - బాపురం, చింతకుంట రిజర్వాయర్లకు స్తబ్ధుగా పంపింగ్ - 3శాతానికి మించి నిండని హొళగుంద ఎస్ఎస్ ట్యాంకు - నేటి ఉదయానికి కాల్వలో నీరు నిలిచిపోయే అవకాశం - తాగునీటి సమస్యపై తీరని ఆందోళన ఆలూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్న రిజర్వాయర్లు, ఎస్ఎస్ ట్యాంకులకు దిగువ కాల్వల నీటిని పంపింగ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. వారం రోజులుగా ఎల్లెల్సీలో నీరు పారుతున్నా పంపింగ్ స్తబ్ధుగా సాగుతుండడంతో కనీస స్థాయిలో కూడా నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కాల్వలో నీటి పారకం అడుగంటడం, రిజర్వాయర్లు నిండకపోవడంతో వచ్చే రెండు నెలల్లో తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తమవుతోంది. హాలహర్వి/హొళగుంద: వేసవిలో తాగునీటి అవసరాల కోసం టీబీ డ్యాంనుంచి దిగువ కాల్వ ద్వారా విడుదల చేసిన నీటిని రిజర్వాయర్లకు పంపింగ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. ఫలితంగా దిగువ కాల్వలో నీటి ప్రవాహం అడుగంటినా రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపుకోలేని పరిస్థితి నెలకొంది. హాలహర్వి మండలానికి సంబంధించి బాపురంలో రెండు, చింతకుంటలో ఒకటి, హొళగుంద మండల కేంద్రంలో ఎస్ఎస్ ట్యాంకుంది. చింతకుంట నుంచి 18 గ్రామాలకు , బాపురం నుంచి 27 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. రెండు నెలల నుంచి కాల్వలో నీరు బంద్ కావడంతో రిజర్వాయర్లు పూర్తిగా ఎండి పోయాయి. దీంతో కుళాయిలకు నీటి సరఫరా నిలిచిపోయి తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడ్డారు. సమస్యను దృష్టిలో ఉంచుకుని టీబీ డ్యాం అధికారులు ఈ నెల 7న కాల్వకు నీటిని విడుదల చేయగా 13వ తేదీ నాటికి నీరు ఆంధ్రా సరిహద్దు చేరింది. ఈ నీటిని రిజర్వాయర్లకు పంపింగ్ చేసి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, జేఈలకు ఆదేశాలు ఇచ్చారు. పూర్తిస్థాయిలో నిండితే కదా.. బాపురం పాత రిజర్వాయర్‌లో 8, కొత్త రిజర్వాయర్‌లో 14 అడుగుల మేరకు నీటిని నింపుకోవాల్సి ఉంది. ఇలా చేస్తే వాటి పరిధిలోని 27 గ్రామాలకు ఐదు నెలల పాటు డోకా ఉండదు. అయితే పైప్‌లైన్ సరిగా లేదంటూ పాత రిజర్వాయర్‌ను పక్కనపెట్టిన అధికారులు కొత్త రిజర్వాయర్ కోసం పది అదనపు మోటార్లు ఏర్పాటు చేసినా ఆరడుగులకు మించి నింపలేకపోయారు. చింతకుంట రిజర్వాయర్‌ది కూడా ఇదే పరిస్థితి(ఆరడుగులు నిండింది). ఈ నీటిని రోజు మర్చి రోజు సరఫరా చేసినా వాటి పరిధిలోని గ్రామాలకు నెలకు మించి సరిపోయే పరిస్థితి లేదన్న అభిప్రాయం ఉంది. మరోవైపు అదనపు మోటార్లు లేక పోవడంతోనే రిజర్వాయర్లను నింపలేకపోయామని ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది చెబుతున్నారు. మే 10వరకు కాల్వలో పారకం ఉంటే పూర్తిస్థాయిలో నింపేవారమని జేఈ రాంనీలా చెప్పారు. హొళగుంద ఎస్ఎస్ ట్యాంకు.. స్థానిక కడ్లమాగి వద్ద రూ.10 కోట్లతో నిర్మించిన ఎస్ఎస్ ట్యాంకు ఆదివారం నాటికి 30 శాతం నిండింది. ఈ నెల 13 నుంచి 150 హెచ్‌పీ మోటార్లతో పంపింగ్ చేస్తున్నారు. 6.30 లక్షల క్యూబిక్ మీటర్ల విస్తీర్ణం 30 మీటర్ల ఎత్తున్న ఈ ట్యాంకుకు 11 రోజులపాటు పంపింగ్ చేసినా 2.6 మీటర్లకు మించలేదు. ఈ నీరు హొళగుంద వాసుల తాగునీటి అవసరాలకు 40 రోజులకు మించి సరిపోయే పరిస్థితి లేదని అధికారులే చెబుతున్నారు. ట్యాంకు పనులు కొన్ని నెలల ముందుగానే పూర్తయినా నీటిని నిల్వ చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్లే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని జనం వాపోతున్నారు. సోమవారం ఉదయానికి కాల్వలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. సమ్మతగేరి, హెబ్బటం ట్యాంకుల సామర్థ్యం వరుసగా 3లక్షలు, 6లక్షల క్యూబిక్ మీటర్లుండగా పూర్తిస్థాయిలో నింపేశారు. రిజర్వాయర్ - సామర్థ్యం - ప్రస్తుత నిల్వ బాపురం-1 (కొత్తది) - 14 అడుగులు - 6 అడుగులు బాపురం -2(పాతది) - 8 అడుగులు - 0 చింతకుంట : 13 అగుగులు - 6 అడుగులు హొళగుంద ఎస్ఎస్ ట్యాంకు 30 మీటర్లు 2.6 మీటర్లు సమ్మతగేరి 3లక్షల క్యూ.మీ. పూర్తిస్థాయి హెబ్బటం 6 లక్షలు కూ.మీ. పూర్తిస్థాయి -
ఎల్లెల్సీలో తగ్గిన నీటి ప్రవాహం
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్ల్సెల్సీ)లో శనివారం నీటి ప్రవాహం తగ్గింది. డ్యాంలో నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం తుంగభద్ర బోర్డు అధికారులు ఎల్లెల్సీకి నీటి సరఫరా నిలిపి వేశారు. హొళగుంద సెక్షన్ 181 కిలో మీటర్ వద్ద కాలువలో ప్రవాహం నిలిచిపోయింది. టీబీ డ్యాంలో శనివారం నాటికి 1.70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
జటిలం
- ఎల్లెల్సీకి నిలిచిన నీటి సరఫరా - పొంచి ఉన్న నీటి ముప్పు - 200 గ్రామాల్లో తీరని దాహార్తి - నిండని ఎస్ఎస్ ట్యాంకులు - టీబీ డ్యాంలో అడుగంటిన నీరు ఆదోని: జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తీవ్రం కానుంది. దాహారికి తీర్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు శుక్రవారం నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లోని 200 గ్రామాల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాగునీటి కోసం రబీ పంటలను రైతులు త్యాగం చేశారు. దాదాపు లక్ష ఎకరాల్లో రబీ పంటలకు సెలవు ప్రకటించారు. పంటలు సాగు చేస్తే మొత్తం నీటిని వినియోగించుకోవాల్సి వస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తుంగభద్ర రిజర్వాయర్‌లో ఏపీ వాటా కేటాయింపులో ఇంకా 2 టీఎంలసీల నీరు నిల్వ ఉన్నాయి. అయితే జిల్లా ప్రజల తాగు నీటి అవసరాల మేరకు నీటిని సరఫరా చేయకుండా అర్ధంతరంగా నిలిపి వేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మూడు రోజుల్లోనే పడిపోయిన నీటి మట్టం వేసవిలో ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలతో సహా 200 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. దీంతో ఈ నెల 9న టీబీ డ్యాం నుంచి 760 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అవి ఈ నెల 14న జిల్లా సరిహద్దుకు చేరుకున్నాయి. మొదటి మూడు రోజులు 350 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం ఉండడంతో ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఎస్ఎస్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కనీసం 10 రోజుల పాటు కాలువలో నీటి ప్రవాహం 350 క్యూసెక్కులు ఉంటే ఎస్ఎస్ ట్యాంకులను పూర్తిగా నింపుకోవచ్చు. అయితే నీటి సరఫరా ప్రారంభం అయిన మూడో రోజు నుంచే కాలువలో నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చింది. శుక్రవారం బోర్డు సరిహద్దు అయిన హానువాళు వద్ద కాలువలో నీటి మట్టం 290 క్యూసెక్కులకు పడిపోయింది. ఎగువన ఉన్న కర్ణాటకలో రాష్ట్ర వాటా నీటిని అక్రమంగా మళ్లించుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దాహం తీరేదెలా.. జిల్లా పశ్చిమ ప్రాంతంలో 28 ఎస్ఎస్ ట్యాంకులు నిర్మించారు. వీటికి వారం రోజులుగా నీటిని నింపుతున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాలలోని ఎస్ఎస్ ట్యాంకులకు రెండు రోజుల క్రితమే నీటి పంపింగ్ ప్రారంభం అయింది. మొత్తం 8 ట్యాంకులకు మాత్రం 50 శాతంకు పైగా నీటిని పంపింగ్ చేశారు. అయితే నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆదివారానికి నీటి మట్టం పూర్తిగా పడిపోతోంది. దీంతో నీటి పంపింగ్ కూడా నిలిచిపోతోంది. ప్రస్తుతం ఆయా ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీరు నెలలో ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ట్యాంకులు ఖాళీ అయితే బిందెడు నీరు కూడా దొరక్క తాగు నీటి దాహార్తితో పడరాని పాట్లు పడాల్సి వస్తోందని ఆయా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జలాశయం ఖాళీ తుంగభద్ర జలాశయం ఖాళీ కావడంతో బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. కనీసం 2 టీఎంసీలు ఉండాల్సి ఉండగా తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 1.75 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. వర్షాలు వచ్చి జలాశయంలోకి ఇన్‌ఫ్లో పెరిగితే వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని బోర్డు అధికారులకు సూచించాం. ఇందుకు బోర్డు అధికారులు కూడా అంగీకరించారు. - భాస్కరరెడ్డి, ఈఈ, ఆదోని తుంగభద్ర ప్రాజెక్టు -
ఎల్లెల్సీకి నీటి విడుదల
హొళగుంద: తుంగభద్ర దిగువ కాల్వకు శుక్రవారం డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. ప్రతి రెండు గంటలకు వంద క్యూసెక్కుల చొప్పున పెంచుతూపోతున్నారు. గతంలో ఫిబ్రనరి 6న కాల్వకు నీటి సరఫరాను నిలిపేశారు. తాగనీటి అవసరాల కోసం ఆంధ్ర కోటా నీటిని విడుదల చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఆంధ్ర బార్డర్(250కిమీ)కు 600 క్యూసెక్కుల నీటిపి పారించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ నాటికి ఆంధ్ర పరిధి(చింతకుంట 135కిమీ)నీరు చేరే అవకాశం ఉందన్నారు. శుక్రవారం డ్యాం నీటిమట్టం 1578 అడుగుల వద్ద 3.70 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
ఎల్లెల్సీకి నీటి విడుదల
హోళగుంద : తుంగభద్ర డ్యాం నుంచి శనివారం రాత్రి బోర్డు అధికారులు దిగువ కాల్వ(ఎల్లెల్సీ)కు నీటిని విడుదల చేశారు. ముందుగా పసవర్ కెనాల్‌కు విడుదల చేసిన అధికారులు శనివారం రాత్రి ఎల్లెల్సీకి వదిలి రెండు గంటలకు వంద క్యూసెక్కుల చొప్పున పెంచుతూ పోతున్నారు. తాగునీరు అవసరాల కోసం దిగువకు 987 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు చెప్పారు. శనివారం డ్యాంలో నీటిమట్టం 1585 అడుగులతో 6.83 టీఎంసీలు నిల్వ ఉంది. -
ఆంధ్ర సరిహద్దుకు చేరిన ఎల్లెల్సీ నీరు
హాలహర్వి : తుంగభద్ర డ్యాం నీరు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని 135వ మైలురాయికి మంగళవారం సాయంత్రం చేరింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు మాత్రమే వదిలారు. ప్రస్తుతం దిగువ కాలువకు నీరు చేరిందని ఆంధ్రసరిహద్దు ఎల్లెల్సీ డీఈ నెహేమియా మంగళవారం విలేకరులకు తెలిపారు. ఎవరైనా ఈ నీటిని అక్రమంగా సాగుకు ఉపయోగించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేటి నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల బంద్
- జీడీపీలో తగ్గిన నీటి నిల్వలు - ఎస్ఈ చంద్రశేఖర్ రావు గూడూరు రూరల్: గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎల్లెల్సీకి బుధవారం నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు నీటిపారుదలశాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టులో నీటినిల్వ తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్యాలకుర్తి సమీపంలోని కర్నూలు బ్రాంచ్ కెనాల్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లెల్సీ నీటిని పైపులైన్లు వేసుకుని వినియోగించినా, అలాంటి వాటిని ప్రోత్సహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జలచౌర్యం జరగుతోందని ఫిర్యాదులు రావడంతో కాలువను పరిశీలించామన్నారు. ఆయన వెంట ఈఈ భాస్కర్‌రెడ్డి, డీఈ లక్ష్మణ్‌కుమార్, ఏఈ విజయ్‌కుమార్, సూపర్వైజర్ రామేశ్వరరెడ్డి, లస్కర్ మహబూబ్‌బాష ఉన్నారు. -
నెలాఖరు వరకు ఎల్లెల్సీకి నీరు
హొళగుంద: తుంగభద్ర దిగువ కాల్వ(ఎల్లెల్సీ)కు ఈ నెలాఖరు వరకు సాగునీటి సరఫరా ఉంటుందని టీబీ బోర్డు ఈఈ విశ్వనాథరెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. నీటి విడుదలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్షాభావం కారణంగా ఈ ఏడాది డ్యాంలో 60 టీఎంసీల నీరు మాత్రమే చేరిందని చెప్పిన ఆయన ఈ నెల 27 వరకు ఆంధ్ర కోటా కింద నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. అందులో భాగంగా కాల్వ కింద సాగైన పంటలు, ఆంధ్రాకు తాగునీరును అందించాలనే ఉద్దేశంతో బోర్డు ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కర్ణాటక కోటా నీటిని నిలిపి వేసి ఆంధ్రాకు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు ఈఈ వెల్లడించారు. -
జలకలం
జల చౌర్యానికి టీడీపీ నేతల వత్తాసు - దిగువ కాలువ పొడవునా పైపులే.. - తొలగింపునకు ఎల్ఎల్సీ ఇంజనీర్ల యత్నం - స్థానియ నాయకుల నుంచి బెదిరింపులు - ఈనెల 10తో కాల్వకు నీటి విడుదల నిలిపివేత - ఆయకట్టు రైతుల్లో ఆందోళన పంట ఎండుతోంది దిగువ కాలువ కింద నాలుగు ఎకరాల ఆయకట్టు పొలం ఉంది. ఈ యేడాది వరి పంట సాగు చేసినా. తుంగభద్ర డ్యాంలో అరకొర నీరు ఉండడంతో వంతుల వారీగా పంటకు నీరిస్తున్నారు. ఆంధ్ర సరిహద్దు దిగువ కాలువ మైలురాయి 135 కి.మీ.కు ముందున్న కర్ణాటకలోని సింధువాళం, బొమ్మనహాల్, గొనేహాల్ తదితర గ్రామాల రైతులు జలచౌర్యానికి పాల్పడుతున్నారు. దీంతో నీరందక మా పొలం ఎండుతోంది. చుట్టుపక్క రైతులదీ ఇదే పరిస్థితి. – బసవన్నగౌడ్, ఎల్లెల్సీ ఆయకట్టు రైతు, బాపురం గ్రామం తుంగభద్ర దిగువ కాలువ 261.9 కి.మీ వద్ద పైపులు వేసి అక్రమంగా జల చౌర్యం చేస్తుండగా ఎల్ఎల్సీ డీఈఈ నెహిమియా ఆధ్వర్యంలో పైపులు తొలగించేందుకు యత్నించారు. ఆ సందర్భంగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఫోన్ చేసి పైపులు తొలగిస్తే నీ కథ చూస్తానని బెదిరించారు. ఎల్ఎల్సీ కాలువ డిస్ట్రిబ్యూటరీ 76 వద్ద నుంచి కాల్వకు గండి కొట్టి మరీ పెద్ద పెద్ద పైపులు వేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఇంజినీర్లపై ఆదోనికి చెందిన టీడీపీ నేత అనుచరులు దాడికి యత్నించారు. కాలువ పరిధిలోని 135 నుంచి 290 కి.మీ వరకు అనధికార నీటి వినియోగాన్ని కొందరు అధికార పార్టీ నేతలే ప్రోత్సహిస్తుండటం గమనార్హం. కర్నూలు సిటీ: అధికార పార్టీ నేతలు జల చౌర్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా తుంగభద్ర దిగువ కాలువకు నీరందక పంటలు ఎండుతున్నాయి. ఈ ఏడాది కర్ణాటక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం వల్ల టీబీ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేకపోయింది. డ్యాంలోకి వచ్చిన నీటి లెక్కల ప్రకారం దిగువ కాలువకు కేటాయించిన వాటా నీరు కూడా జల చౌర్యం వల్ల జిల్లాకు చేరని పరిస్థితి ఉంది. ఈ కారణంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి సాగునీటి సమస్య తీవ్రమవుతోంది. దిగువ కాలువపై సుమారు 10 రోజులుగా గస్తీ నిర్వహిస్తున్నా.. కాల్వలో నీటి ప్రవాహం ఏమాత్రం పెరగకపోవడం గమనార్హం. అయితే తుంగభద్ర బోర్డు ఈనెల 10 నుంచి కాల్వకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు సమాచారం. కాల్వపై 8 టీముల పర్యటన ఈ ఏడాది జూన్‌లో జరిగిన బోర్డు సమావేశంలో 151 టీఎంసీల నీరు వస్తుందని అంచనా వేయగా.. ఆ స్థాయిలో నీరు రాకపోవడంతో 82 టీఎంసీలకే పరిమితం అయ్యింది. 151 టీఎంసీల ప్రకారం అయితే దిగువ కాలువకు 17.23 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. అధికారుల అంచనాలు తప్పడంతో ఈ వాటా 8.3 టీఎంసీలకు చేరుకుంది. ఇప్పటి వరకు 3.5 టీఎంసీల నీరు వినియోగించుకోగా.. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 30వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వాస్తవానికి ఇంతకు ఎక్కువే సాగయింది. ఈ ఆయకట్టుకు 690 క్యుసెక్కుల నీటికి ఇండెంట్ పెట్టారు. అయితే 240 క్యుసెక్కులకు మించి నీరు రాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు శాఖలకు చెందిన అధికారులతో 8 టీములు ఏర్పాటయ్యాయి. ఈ టీంలు కాల్వపై పర్యటిస్తూ జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు పైపులు తొలగిస్తున్నారు. నేతల మధ్య కొరవడిన సఖ్యత అనంతపురం జిల్లాలోని అధికార పార్టీ నేతలంతా సాగు నీటి కోసం ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఫలితంగా ఎగువ కాల్వకు ఈ ఏడాది కేటాయించిన 13 టీఎంసీల నీటి మొత్తాన్ని ఎక్కడా చౌర్యం కాకుండా ప్రతి బొట్టునూ వినియోగించుకున్నారు. జిల్లాలో మాత్రం ఎల్ఎల్సీ ఆయకట్టు ప్రాంతానికి చెందిన టీడీపీ నేతల మధ్య సమన్వయం కొరవడింది. అధికార పార్టీలో ఉన్న ఒక నాయకుడు జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు దీక్షలు చేస్తానంటే.. మరో నాయకుడు జల చౌర్యాన్ని అడ్డుకుంటే మీ అంతు చూస్తానని అధికారులను బెదిరిస్తున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా టీబీ బోర్డుపై ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకురాలేకపోతున్న నేతలు.. రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా సానుభూతి కోసం యత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నాయకులు స్వార్థం వీడాలి జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు 8 టీములు పని చేస్తున్నాయి. కొన్ని చోట్ల కాల్వకు ఉన్న పైపులను తొలగించవద్దని ఒత్తిళ్లు చేస్తున్నాయి. నాయకులు రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాకుండా రైతులకు మేలు చేకూర్చేందుకు యత్నించాలి. మా వంతుగా జల చౌర్యాన్ని అడ్డుకుంటున్నాం. – ఎస్.చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ ఎస్ఈ -
జలచౌర్యంపై దాడులు
హొళగుంద: తుంగభద్ర దిగువ కాల్వ(ఎల్లెల్సీ) నుంచి అక్రమ నీటిమళ్లింపును అరికట్టేందుకు ఆంధ్ర–కర్ణాటక రాష్ట్ర అధికారులు ఉమ్మడిగా దాడులు చేపట్టారు. వర్షాభావంతో తుంగభద్ర డ్యాంలో నీటి పరిమాణం తగ్గుతుండడం, అక్రమ ఆయకట్టు వల్ల ఎల్లెల్సీలో నీరు ముందుకు వెళ్లకపోవడంతో ఇరు రాష్ట్రాలకు చెందిన కలెక్టర్ల ఆదేశాల మేరకు టీబీ బోర్డు, ఆంధ్ర ఎస్ఈ శశిభూషణ్‌రావు, నాగేశ్వరరావు, ఈఈలు విశ్వనాథరెడ్డి, భాస్కర్‌రెడ్డి స్పందించారు. ఏఆర్, సివిల్ పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖాధికారులతో కూడిన 8 బృందాలను కాల్వపై గస్తీ తిరగడానికి ఏర్పాటు చేసినట్లు ఎస్డీఓ పంపన్నగౌడ్ తెలిపారు. ఆదివారం హొళగుంద ఎల్లెల్సీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర సరిహద్దు 135–250 కిమీ వరకు ఐదు బృందాలు 250–329 కిమీ వరకు మూడు బృందాలు గస్తీ తిరుగుతున్నట్లు తెలిపారు. జలచౌర్యానికి పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, భారీగా జరిమానాలు వేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1607.31 అడుగులతో 30 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన చెప్పారు. రోజుకు ఒక టీయంసీ ప్రకారం విడుదల జరుగుతోందని, నవంబర్ 15వ తేదీ లోపల కాల్వకు నీటి సరఫరా నిలిపి వేసే అవకాశాలున్నాయన్నారు. -
చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు
కర్నూలు(సిటీ): తుంగభద్ర దిగువ కాల్వ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ భవనంలో ఎల్లెల్సీ ఇంజనీర్లతో జలచౌర్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుంగభద్ర దిగువ కాల్వకు ఉన్న వాటా మేరకు నీరు తీసుకొచ్చి చివరి ఆయకట్టు వరకు నీరందించే బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. ప్రధానంగా జలచౌర్యం బోర్డు పరిధిలో ఉన్న కాల్వ నుంచే జరుగుతోందన్నారు. దీనిపై ముందు నుంచి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రతి ఏటా వాటా నీటిని ఎగువ ప్రాంతం వారు చౌర్యం చేసి వేలాది ఎకరాల అక్రమ ఆయకట్టును సాగు చేస్తున్నారన్నారు. ఈ చౌర్యం అరికట్టేందుకే 135 నుంచి 324 కి.మీ వరకు నాలుగు శాఖలకు చెందిన అధికారులతో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో విద్యుత్ శాఖ, జలనవరుల శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక బృందాల్లో ఉంటారన్నారు. నిత్యం కాల్వపై పర్యవేక్షిస్తూ అక్రమంగా నీటిని వాడుకుంటున్న వారిపై కేసులు నమోదు చేసి అయినా, చివరి ఆయకట్టుకు నీరందించాల్సిన అవసరం ఉందన్నారు. నెల రోజుల పాటు నిరంతరంగా కాల్వపైనే ఈ ప్రత్యేక బృందాలు తిరుగుతూ చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో నిఘాను విస్తృతం చేసి గస్తీ నిర్వహించాలన్నారు. ఏఈతో పాటు లస్కరు ఖచ్చితంగా ప్రతిరోజు విధులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం ఉన్న టీములలో ఉన్న లస్కర్లను తొలగించి, నూతన టీమ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకొని జలచౌర్యాన్ని అరికట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. -
చివరి ఆయకట్టుకు 400 క్యూసెక్కుల నీరు
ఆదోని రూరల్ : తుంగభద్ర దిగువ కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో చివరి ఆయకట్టు వరకు 400 క్యూసెక్కుల నీటిని అందించేందుకు పటిష్ట చర్యలు చేపడదామని టీబీపీ డ్యాం అధికారులు, ఎల్లెల్సీ అధికారులు తీర్మానించారు. బోర్డు నుంచి ఆంధ్రాకు రావాల్సిన 600 క్యూసెక్కుల నీటిని కర్ణాటక నానాయకట్టు రైతులు అక్రమంగా వాడుకుంటున్నారని కనీసం కౌతాళం డీపీ నం.74వ కి.మీ. వరకు ఎల్ఎల్సీ ప్రధాన కాలువకు నీరు అందకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం ఆదోనిలో ఉన్న ఎల్లెల్సీ ఈఈ కార్యాలయాన్ని దిగ్భందించి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎల్లెల్సీ అధికారులు ఎస్ఈ చంద్రశేఖర్ రావు, ఈఈ భాస్కర్‌రెడ్డి, టీబీ బోర్డు అధికారులు ఎస్ఈ శశిభూషణ్ రావు, ఈఈ విశ్వనాథ్‌రెడ్డితో బుధవారం స్థానిక ఈఈ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చింతకుంట 135కి.మీ. వరకు 800 క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని బోర్డు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి 250 కి.మీ. గల చివరి ఆయకట్టు వరకు కనీసం 400 క్యూసెక్కుల నీటిని రైతులకు అందించే విధంగా ఎల్లెల్సీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై బోర్డు సెక్రటరీతో సమావేశం నిర్వహించి త్వరలోనే రైతులకు నీటిని అందించే విధంగా చొరవ చూపుతామని టీబీ అధికారులు హామీ ఇచ్చారు. ఎస్ఈ చంద్రశేఖర్ రావు, ఈఈ భాస్కర్‌రెడ్డి , బోర్డు డీఈలు పంపన్న, గౌడ్, శ్రీనివాసనాయక్, ఎల్ల్సీ డీఈలు నెహామియా, విశ్వనథ్రెడ్డి, జేఈలు పాల్గొన్నారు. -
ఎల్లెల్సీ ఈఈ కార్యాలయం ముట్టడి
ఎల్ఎల్సీ నీటి వాటా తగ్గించడంపై రైతుల ఆగ్రహం ఈఈతో వాగ్వాదం ఆదోని రూరల్ : రబీలో తమకు రావాల్సిన నీటి వాటా పూర్తిగా తగ్గించడాన్ని నిరసిస్తూ కౌతాళం మండలంలోని ఎల్ఎల్సీ ఆయకట్టు రైతులు ఆదోనిలో ఉన్న ఎల్ఎల్సీ ఈఈ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. దాదాపు 200 మంది రైతులు కార్యాలయం ముందు బైఠాయించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఈఈ భాస్కర్‌రెడ్డి బయటకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో ఆయన బయటకు వచ్చారు. దీంతో రైతులు ఈఈని చుట్టముట్టి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సమాధానం చెప్పలేక ఈఈ నీళ్లు నమిలారు. పంటలు ఎండుముఖం పట్టాయి.. రైతులు, సాగునీటి సంఘం నాయకులు వెంకటపతి రాజు, రాఘవరెడ్డి, సుబ్బరాజు, శీనురాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ఎల్సీకి రావాల్సిన నీటి వాటాలో తమ డీపీ 74కు పూర్తిగా నీరు నిలిచిపోయిందన్నారు. దీంతో రబీ కింద సాగు చేసిన పత్తి, వరి, మిరప పంటలు(సుమారు వెయ్యి ఎకరాలు) ఎండుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40–50వేలు దాకా పెట్టుబడులు పెట్టామని, ఉన్నట్టుండి నీటిని నిలిపివేస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించాలని, లేనిపక్షంలో కదిలేదిలేదని భీష్మించారు. చివరికి ఈఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి ఽతీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులు ధర్మరాజు, గోవిందయ్య, దొడ్డయ్య, ఈరన్న, రామాంజనేయులు, ఉరుకుందప్ప పాల్గొన్నారు. -
దిగువకు దిక్కెవరు?
- హామీని విస్మరించిన చంద్రబాబు - ఎల్లెల్సీలో యథేచ్ఛగా జలచౌర్యం - పట్టించుకోని అధికార పార్టీ నేతలు - బీడుభూమిగా మారుతున్న ఆయకట్టు - కాల్వ ఏపీది.. పెత్తనం బోర్డుది - పర్యవేక్షణ కరువు..అందని నీటివాటా కర్నూలు సిటీ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తుంగభద్ర జలాల వాటాలో నుంచి చుక్క నీరు కూడా చౌర్యం కాకుండా చూస్తాం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతులు జలచౌర్యం చేయకుండా ఎల్ఎల్సీ ఆధునీకరణ చేయడమా? లేకపోతే ప్రధాన కాల్వకు బదులు అంతర్గత పైపులు లైన్లు వేయడమా అనేది చూస్తాం - ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వచ్చాక జల చౌర్యాన్ని అడ్డుకోలేకపోయారు. ఫలితంగా తుంగభద్ర జలాల్లో కర్నూలు జిల్లా తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ అన్యాయంపై తుంగభద్ర బోర్డు అధికారులను టీడీపీ నేతలు నిలదీయలేకపోతున్నారు. దీంతో ఆయకట్టుకు నీరు అందక పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం. డ్యాం నిర్వహణకు ఏర్పాటు అయిన బోర్డు మూడు రాష్ట్రాలకు దామాషా ప్రకారం సాగు నీరు అందించాల్సి ఉంది. అయితే బోర్డు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తూ.. మిగతా రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. టీబీ డ్యాం నుంచి దిగువ కాలువ కింద జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు మండలాలకు చెందిన 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వ ఏపీది...పెత్తనం బోర్డుది దిగువ(ఎల్ఎల్సీ)కాల్వ మొత్తం 398 కి.మీ పొడవు ఉంటుంది. ఇందులో కర్ణాటక పరిధిలో 134 కి.మీ మాత్రమే ఉండేది. మిగతాది ఏపీకి చెందినది. అయినా 135 నుంచి 250 కి.మీ వరకు ఉన్న కాలువ నిర్వహణ బోర్డు పరిధిలో ఉంది. దామాషా ప్రకారం అందాల్సిన వాటా నీరు అందించేందుకు కాల్వపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. దీంతో జల చౌర్యం యథేచ్ఛగా సాగుతోంది. ప్రధాన కాల్వకు పైపులు వేసి నీటిని కర్ణాటక రైతులు తోడేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. ప్రస్తుతం కాల్వకు 690 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉంది. అయితే 200 క్యూసెక్కుల నీరు రావడం లేదు. ఏపీలో ఉన్న కాలువపై బోర్డు పర్యవేక్షణ ఉండడంతో ఆ ప్రాంతానికి ఇంజినీర్లు వెళ్లడం లేదు. బోర్డు పరిధిలోని కాలువకు ఏపీకి అప్పగిస్తేనే వాటా మేరకు కొంత మేరకైనా నీరు వస్తుందని ఇంజినీర్లు సాగు నీటి సలహా మండలి సమావేశం దృష్టికి తీసుకపోయినా..ప్రభుత్వం స్పందించడం లేదు. జలచౌర్యం మితిమీరిపోయింది – యస్.చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ ఎస్ఈ దిగువ కాలువ 135 నుంచి 250 కి.మీ వరకు బోర్డు పరిధిలో ఉంది. ఈ కారణంతోనే ఆ ప్రాంతంలో అధిక శాతం జల చౌర్యం జరుగుతోంది ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకపోయాం. ఈ ఏడాది చౌర్యం మితిమీరిపోయింది. దానాని అడ్డుకోవాలనే 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. చౌర్యం అడ్డుకోకపోతే ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వడం ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఆంధ్ర సరిహద్దు వరకు పైప్‌లైన్ వేయాలి: అబ్దుల్ కరీం, రిటైర్డ్ ఇరిగేషన్ డీఈఈ ఎల్లెల్సీ వాటా నీరు రావాలంటే డ్యామ్ నుంచి ఏపీ సరిహద్దు వరకు పైప్‌లైన్ వేయాలి. హొళగుంద సమీపంలో రెగ్యులేటర్‌ను నిర్మించి వాటా నీటిని నిలువ చేస్తే రెగ్యులేటర్ నుంచి పైప్‌లైన్ ద్వారా ఎల్లెల్సీలోకి అవసరమైన మేర విడుదల చేసుకునే వెసులబాటు ఉంటుంది. ఈ రెండు ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉన్నాయి. వరి సాగు మరచిపోయాం: గోపాల్, రైతు, నందవరం ఎల్లెల్సీకి నీరు రాకపోవడంతో వరి సాగు చేయడం మరచిపోయాం. కాలువ కింద ఉన్న పొలాల్లో పత్తి పంట సాగు చేశాం. ఆరేళ్లుగా వరి పంట లేదు. బియ్యాన్ని అంగట్లో కొనుగోలు చేసి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకపుడు వరి పంట పైర్లతో కళకళలాడేవి. ఇపుడు ఎక్కడ చూసిన మెట్ట పంటలు తప్ప మరొకటి కనిపించదు. -
ఏమో.. ఎప్పుడైనా నిలిపేయచ్చు
– ఎల్లెల్సీకి నీటి విడుదల కొనసాగింపుపై టీబీ బోర్డు ఎస్ఈ – ఈఈ, ఎస్డీఓతో కలిసి కాల్వపై పర్యటన హోళగుంద : తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ)కు నీటి విడుదల కొనసాగింపుపై ఎస్ఈ శశిభూషణ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. ఆయకట్టులో సాగు చేసిన పంటల పరిస్థితి, సాగు చేయబోయే పంటలకు సంబంధించి ఆయకట్టు రైతులు క్లారిటీ కోసం ప్రయత్నించగా ఆయన స్పష్టమైన సమాధానం చెప్పలేదు. పరిస్థితిని బట్టి ఎప్పుడైనా నీటి విడుదలను నిలిపేసే అవకాశం ఉందని తెలిపారు. కర్ణాటకలో జలచౌర్యం జరుగుతుండడం వాస్తవమేనని అంగీకరించారు. హాలహర్వీ మండలం గూళ్యం వద్ద శుక్రవారం రాత్రి టీబీ బోర్డు అధికారులు, రైతుల మధ్య వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో శనివారం ఈఈ విశ్వనాథరెడ్డి, ఎస్డీఓ పంపనగౌడ్తో కలిసి ఆయన కాల్వపై పర్యటించారు. సిబ్బంది, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హŸళగుందలోని టీబీపీ గెస్ట్‌హౌస్‌లో బోర్డు అధికారులు, ఎల్లెల్సీ ప్రాజెక్ట్ చైర్మన్ కుమార్‌గౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాలు ప్రస్తుత నీటి నిల్వలో నిర్ణయించిన నీటి వాటాలను అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. డ్యాంలో 62 టీఎంసీల నీరు నిల్వ ఉంటే వరి పంటకు ఇబ్బంది ఉండదని చెప్పిన ఆయన ప్రస్తుతం 44 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిలో దిగువ కాల్వ(ఎల్లెల్సీ) ఎప్పుడు నీటి సరఫరాను నిలిపివేస్తామో చెప్పలేమన్నారు. వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఇప్పటికే సాగైన పంటల గురించి తామేమి చెప్పలేమని తెలిపారు. రైతులు సహకరించాలని ఆయన కోరారు. గూళ్యం రైతుల ఫిర్యాదు.. ఎస్డీఓ మల్లికారునతో శుక్రవారం రాత్రి దిగువ కాల్వపై వాగ్వాదానికి దిగిన గూళ్యం రైతులు శనివారం కుమార్‌గౌడ్‌తో కలిసి ఎస్ఈకి ఫిర్యాదు చేశారు. ఎండుతున్న పంటలకు సాగునీరు అందించాలని కోరగా దురుసుగా ప్రవర్తించారని ఆయన దష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిన్నహ్యాట శేషగిరి, గాలి వీరభద్రగౌడ్, పంపాపతి, దురుగప్ప, తోక వెంకటేశ్, దిడ్డి వెంకటేశ్, వేణు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర సరిహద్దు చేరిన ఎల్లెల్సీ నీరు
హాలహర్వి : తుంగభద్ర డ్యాం నుంచి దిగువకాల్వకు విడుదలైన నీరు ఆదివారం రాత్రికి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని 135వ మైలురాయిని దాటాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రైతులు సోమవారం తుంగభద్ర జలాలకు పూజలు చేశారు. ఈ నెల 18వ తేదీన తుంగభద్ర డ్యాం అధికారులు ఆంధ్రాకు తాగునీటి అవసరాల నిమిత్తం 690 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే కర్ణాటకలోని 6వ కి.మీ. వద్ద కాలువకు ఓ చోట గండి పడడంతో నీటిని నిలుపుదల చేశారు. గండిని పూడ్చేందుకు అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు. రెండు రోజులక్రితం గండి పూడ్చడం పూర్తయిన తర్వాత తిరిగి నీట విడుదలను కోనసాగించారు. ఆ నీరే ప్రస్తుతం దిగువ కాలువకు చేరిందని ఆంధ్రసరిహద్దు ఎల్లెల్సీ డీఈ నెహేమియా సోమవారం విలేకరులకు తెలిపారు. డ్యాంలో పూర్తిస్థాయిలో నీరు చేరితే సాగునీటిని కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. -
ఎల్లెల్సీకి నీరు విడుదల
– తాగునీటి కోసమే అంటున్న అధికారులు – సాగునీటికి ఇప్పట్లో విడుదల లేనట్లే – టీబీ డ్యాంలో నీటి నిల్వ 40.9 టీయంసీలు కర్నూలు సిటీ: తాగునీటి అవసరాల కోసం కర్ణాటక రాష్ట్రం హŸస్పేటలోని తుంగభద్ర జలాశయం నుంచి తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కి గురువారం 690 క్యుసెక్కుల నీరు విడుదల చేశారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు ఉండడంతో జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్.. టీబీ బోర్డుకు ఇండెంట్ పెట్టారు. టీబీ బోర్డు అధికారులు స్పందించి నీరు విడుదల చేశారు. పశ్చిమ ప్రాంతంలో 15 రోజులుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. సాగు చేసిన పైర్లు వాడు ముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లెల్సీకి నీరు విడుదల చేశారనే విషయం తెలియగానే రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే అవి తాగునీటి అవసరాలకేనని అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. తుంగభద్ర డ్యాంకు 20 రోజుల్లోనే 36 టీ.యం.సీల నీరు వచ్చి చేరినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 40.9 టీయంసీలు నిల్వ ఉంది. ఏపీతోపాటుæ కర్ణాటక ప్రభుత్వం ఇండెంట్ పెట్టడంతో బోర్డు అధికారులు స్పందించి ఎల్ఎల్సీ కాల్వకు ఏపీ వాటా కింద 690, కర్ణాటక వాటా 650 క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 165 గ్రామాల ప్రజలకు ఎల్లెల్సీ తాగు నీటి అవసరాలు తీరుస్తోంది. తుంగభద్ర దిగువ కాల్వ కింద జిల్లాలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది 90 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని ఇటీవలే జల వనరుల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది దిగువ కాల్వకు 17.05 టీయంసీల నీటి వాటాగా కేటాయించారు. దీంట్లో నుంచి మొదటి విడతలో 690 క్యుసెక్కుల చొప్పున 10 రోజుల పాటు నీరు విడుదల చేయనున్నారు.