ఎల్లెల్సీకి నీటి విడుదల
Published Sun, Jan 22 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
హోళగుంద : తుంగభద్ర డ్యాం నుంచి శనివారం రాత్రి బోర్డు అధికారులు దిగువ కాల్వ(ఎల్లెల్సీ)కు నీటిని విడుదల చేశారు. ముందుగా పసవర్ కెనాల్‌కు విడుదల చేసిన అధికారులు శనివారం రాత్రి ఎల్లెల్సీకి వదిలి రెండు గంటలకు వంద క్యూసెక్కుల చొప్పున పెంచుతూ పోతున్నారు. తాగునీరు అవసరాల కోసం దిగువకు 987 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు చెప్పారు. శనివారం డ్యాంలో నీటిమట్టం 1585 అడుగులతో 6.83 టీఎంసీలు నిల్వ ఉంది.
Advertisement
Advertisement