
ఆంధ్ర సరిహద్దుకు చేరిన ఎల్లెల్సీ నీరు
హాలహర్వి : తుంగభద్ర డ్యాం నీరు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని 135వ మైలురాయికి మంగళవారం సాయంత్రం చేరింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు మాత్రమే వదిలారు. ప్రస్తుతం దిగువ కాలువకు నీరు చేరిందని ఆంధ్రసరిహద్దు ఎల్లెల్సీ డీఈ నెహేమియా మంగళవారం విలేకరులకు తెలిపారు. ఎవరైనా ఈ నీటిని అక్రమంగా సాగుకు ఉపయోగించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.