నేటి నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల బంద్‌ | water closed for llc | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల బంద్‌

Published Tue, Nov 29 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

నేటి నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల బంద్‌

నేటి నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల బంద్‌

- జీడీపీలో తగ్గిన నీటి నిల్వలు
- ఎస్‌ఈ చంద్రశేఖర్‌ రావు
 
గూడూరు రూరల్‌: గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎల్లెల్సీకి బుధవారం నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు నీటిపారుదలశాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టులో నీటినిల్వ తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్యాలకుర్తి సమీపంలోని కర్నూలు బ్రాంచ్‌ కెనాల్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లెల్సీ నీటిని పైపులైన్లు వేసుకుని వినియోగించినా, అలాంటి వాటిని ప్రోత్సహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జలచౌర్యం జరగుతోందని ఫిర్యాదులు రావడంతో కాలువను పరిశీలించామన్నారు. ఆయన వెంట ఈఈ భాస్కర్‌రెడ్డి, డీఈ లక్ష్మణ్‌కుమార్, ఏఈ విజయ్‌కుమార్, సూపర్‌వైజర్‌ రామేశ్వరరెడ్డి, లస్కర్‌ మహబూబ్‌బాష ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement